Toyota yaris cross: SUV మార్కెట్లో టయోటా కార్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ తో వచ్చే కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో టయోటా తన yaris cross SUV ని మరింత ఆకర్షణయంగా రూపొందించింది. 2026 మోడల్ లో కొత్త డిజైన్.. ఆధునిక ఫీచర్లు.. శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజన్ ను అందిస్తోంది. ఇప్పటికే యూరప్ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఈ SUV ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
2026 Toyota yaris cross ముందు భాగంలో కంపెనీ అనేక రకాలుగా మార్పులు చేసింది. కొత్త హనీ హోమ్ తరహా గ్రిల్.. ఆకర్షణీయమైన ఎల్ ఈ డీ హెడ్ లాంప్ లు.. సి ఆకారపు డే టైం రన్నింగ్ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలబోతున్నాయి. కొత్త ఫ్రంట్ బంపర్ suv మరింత స్పోర్టీ లుక్ ను అందిస్తోంది. సైడ్ ప్రొఫైల్లో బలమైన వీల్ ఆర్చ్ లు.. ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. వెనుక భాగంలో suv డిజైన్ కు తగ్గట్టుగా మార్కులు ఉన్నాయి. కొత్త పెర్షియన్ సాల్ట్.. ప్రెషియస్ బ్రాంజ్ వంటి రంగుల్లో ఈ మోడల్ లభిస్తోంది.
ఈ ఎస్ యూవీ లో 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 2026 యూరోపియన్ పేస్ లిస్టులో 130 హెచ్ పీ సామర్థ్యం కలిగిన హైబ్రిడ్ 130 పవర్ ట్రైన్ ను ప్రధాన అందిస్తున్నారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్.. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్.. 130 హెచ్ పీ గరిష్ట పవర్.. 135 Nm టార్క్, e- CVT ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్.. ఫ్రంట్ వీల్ డ్రైవ్.. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ కారు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 10.7 సెకండ్లలోనే అందుకుంటుంది. ఇంధన సామర్థ్యం లీటర్ కు 19.6 నుంచి 22.7 km వరకు ఉంటుందని తెలుస్తోంది.
కారు లోపల భాగంలో టయోటా అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చింది. డాష్ బోర్డులో ప్లాటినం కలర్ ఫినిషింగ్ ఇచ్చింది. ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే వంటి సదుపాయాలు ఉన్నాయి. పనోరమిక్ గ్లాస్ రూప్. వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే.. ఆండ్రాయిడ్ ఆటో.. జేబీఎల్ ఆటో సిస్టం.. వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్.. యాంబియంట్ లైటింగ్.. ఎలక్ట్రిక్ టేల్ గేట్.. స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం టయోటా సేఫ్టీ సెన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తోంది. ఇందులో డ్రైవర్ అసిస్టెంట్.. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
అయితే ఈ మోడల్ కారు మనదేశంలో విక్రయానికి అందుబాటులో లేదు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈ మోడల్ కు సంబంధించిన టెస్టింగ్ వాహనం మనదేశంలో కనిపించినప్పటికీ.. అది విడుదల కాలేదు. యూరప్ లో విక్రయించే యారిస్ క్రాస్.. ఇండోనేషియా వంటి ఆసియా మార్కెట్లో విక్రయించే యారిస్ క్రాస్ మోడల్స్ వేరువేరు వేదికల మీద రూపొందించినవి. వీటి స్పెసిఫికేషన్లు ఒకే విధంగా ఉండవు. ఇక ధర విషయానికొస్తే 2026 యూరోపియన్ మోడల్ ధరలు వేరియంట్.. దేశాన్ని బట్టి మారుతాయి. మనదేశంలో అధికారిక విడుదలపై ప్రకటన లేదు. మొత్తంగా చూస్తే కాంపాక్ట్ ఎస్ యూవీ విభాగంలో ఆకర్షణీయమైన డిజైన్.. హైబ్రిడ్ టెక్నాలజీ.. ఆధునిక భద్రత ఫీచర్లతో టయోటా యారీస్ క్రాస్ మంచి ప్యాకేజీగా కనిపిస్తోంది. అయితే మనదేశంలో ఈ కారు మార్కెట్లోకి వస్తుందా.. ఒకవేళ వస్తే ఎలాంటి ధరతో అందుబాటులోకి వస్తుంది అనేది చూడాల్సి ఉంది.