Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న రోహిత్ ని అన్యాయంగా బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసి బయటకు పంపడం లక్షలాది మంది బిగ్ బాస్ అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. దీనిపై రోహిత్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, నేషనల్ లెవెల్ లో ట్రెండ్ కూడా చేశారు. ఇంత చేసిన తర్వాత బిగ్ బాస్ టీం కచ్చితంగా రోహిత్ రీ ఎంట్రీ ఇప్పించడం పై ఆలోచన చేస్తుంది, కచ్చితంగా రోహిత్ హౌస్ లోకి అడుగుపెడుతాడని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ టీం ప్రేక్షకుల మనోభావాలను అసలు పట్టించుకోలేదు. రోహిత్ రీ ఎంట్రీ ఆశలపై నీళ్లు జల్లారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ‘ది డిక్టేటర్స్’ అనే అంకం నడిచింది. అందులో భాగంగా ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, నామినేషన్స్ ప్రక్రియ లో పాల్గొన్నారు. అయితే వీరిలో ముగ్గురు కంటెస్టెంట్స్ ని వారం రోజుల పాటు హౌస్ లో గెస్టులుగా పెట్టి గేమ్స్ ఆడించే ప్రక్రియ ప్లాన్ చేశారు. అందుకోసం రోహిత్, షాలిని, అపూర్వ లను ఎంచుకున్నారు. అయితే రోహిత్ బిగ్ బాస్ టీం ని ఒక్కటే అడిగాడట. ఈ వారం తర్వాత తనకు బిగ్ బాస్ హౌస్ లో శాశ్వత హౌస్ మేట్ గా ఉండనిస్తారా? లేదా? అని బిగ్ బాస్ టీం ని రోహిత్ అడిగాడట. అందుకు బిగ్ బాస్ టీం కుదరదు అనడంతో రోహిత్ హౌస్ లోకి వచ్చేందుకు ఒప్పుకోలేదట. కనీసం నామినేషన్స్ ప్రక్రియ లో పాల్గొనడానికి కూడా ఆయన ఆసక్తి చూపలేదట.
మీ TRP రేటింగ్స్ కోసం 50 రోజులకు పైగా నన్ను వాడుకున్నారని, మరోసారి నేను మీ రేటింగ్స్ కోసం నా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఆ హౌస్ లోకి రాలేనని, బిగ్ బాస్ టీం తో రోహిత్ తెగేసి చెప్పాడట. ఇది తెలుసుకున్న ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. రోహిత్ తన ఆత్మగౌరవమే కాకుండా, లక్షలాది మంది అభిమానుల గౌరవం కూడా కాపాడుకున్నాడని, ఇలాంటి కంటెస్టెంట్ కి అభిమాని అయ్యినందుకు గర్వంగా ఉందని, రోహిత్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ లో కూడా పాల్గొనకూడదని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ టీం తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం రోహిత్ కచ్చితంగా ఫినాలే ఎపిసోడ్ లో పాల్గొనాలి, మరి రోహిత్ ఒప్పందాన్ని అభిమానుల కోసం ఉల్లంగిస్తాడా? లేదా? అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.