https://oktelugu.com/

Chicken – Fish : చికెన్.. చేపలు… ఇందులో ఏది మంచి ఆహారం

చికెన్ జీర్ణం కావడానికి 32 గంటలు, చేపలు అరగడానికి కేవలం 7 గంటలే సమయం పడుతుంది. దీంతో చికెన్ కంటే చేపలే మంచి ఆహారంగా తేల్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 4, 2023 12:14 pm
    Follow us on

    Chicken – Fish : మనకు మాంసాహారమంటే భలే ఇష్టం. అందుకే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే నోటికి రుచిగా ఉంటుంది. మాంసాహారాల్లో చేపలు, చికెన్ ఏది మంచిదోననే సందేహాలు అందరిలో వస్తుంటాయి. ఈ నేపథ్యంలో చేపలు, చికెన్ రెండింటిలో ఏది సురక్షితమైనదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. చికెన్, చేపలు తినడంలో మనకు ఏ విధమైన ప్రొటీన్లు అందుతాయో తెలుసుకోవడం మంచిది.

    చికెన్, చేపల్లో ఏది అత్యంత పౌష్టికాహారమనే దానిపై అందరిలో అనుమానాలు ఉండటం సహజమే. దీంతో ఏధి బలమైన ఆహారమో తేల్చుకోవాలి. అప్పుడే వాటిని తినేందుకు ఇష్టపడతారు. ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది తింటే మన శరీర వ్యవస్థ బాగుంటుంది? దేన్ని తినడం వల్ల మనకు బలం చేకూరుతుందనే దానిపై మళ్లగుల్లాలు పడుతున్నారు.

    చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ వల్ల గుండెకు మేలు కలుగుతుంది. గుండు జబ్బులు రాకుండా చేయడంలో ఇవి దోహదపడతాయి. ఇందులో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి2 మరియు విటమిన్ డి చేపల్లో ఉంటాయి. ఇందులో పొటాషియం, అయోడిన్, జింక్ వంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందుకే వీటిని బలమైన ఆహారంగా చెబుతారు.

    కోడి మాంసంలో ప్రొటీన్లు ఉన్నాయి. విటమిన్ బి6, బి12, మెగ్నిషియం, సిలీనియం, జింక్ ఉన్నాయి. క్రమం తప్పకుండా చికెన్ తినొచ్చు. కానీ ప్రొటీన్ల పరంగా చూస్తే చికెన్ కంటే చేపలు మంచి ఆహారంగా వైద్యులు చెబుతుంటారు. చికెన్ జీర్ణం కావడానికి 32 గంటలు, చేపలు అరగడానికి కేవలం 7 గంటలే సమయం పడుతుంది. దీంతో చికెన్ కంటే చేపలే మంచి ఆహారంగా తేల్చారు.