Snoring : గురకను దూరం చేసుకోవాలంటే ఇలా చేయండి

గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది.

Written By: Srinivas, Updated On : June 4, 2023 12:20 pm
Follow us on

Snoring : ఈ రోజుల్లో గురక చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. పడుకున్న తరువాత మనం తీసుకునే శ్వాస నోటి నుంచి వస్తే గురకగా చెబుతారు. ముక్కు నుంచి వస్తే శ్వాస గా ఉంటుంది. ఇలా గురక వల్ల పక్కవారు ఇబ్బంది పడతారు. కొందరు గురక పెడితే ఇక పక్కనున్న వారికి శివరాత్రే. అంతటి శబ్దం చేయడం చేస్తుంటారు. గురక చప్పుడుకు ఎదుటి వారు సరిగా పడుకోలేరు. గురకను దూరం చేసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని గురకను దూరం చేసుకుంటే శ్రేయస్కరం.

గురక ఎందుకు వస్తుంది? గురక రావడానికి కారణాల్లో సరైన నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, వెల్లకిలా పడుకోవడం, స్థూలకాయం వంటివి ఉండటం వల్ల గురక వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పడుకున్న తరువాత మనకు తెలియకుండానే గురక వస్తుంది. దీంతో గురకను దూరం చేసుకునేందుకు ప్రయత్నించడం మంచిది.

గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది. ఇలా గురకను లేకుండా చేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.

గురకతో పక్కనున్న వారి నిద్రను పాడు చేయడం కంటే దాన్ని దూరం చేసుకునేందుకు ప్రాధాన్యం చూపితే దాన్ని దూరం చేసుకోవచ్చు. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి గురకను మనం శాశ్వతంగా నివారించుకుంటే ప్రశాంతత లభిస్తుంది. చిన్నపాటి పరిహారాలే కావడంతో వాటిని అనుసరించి గురకను లేకుండా చేసుకోవడం మంచిది.