https://oktelugu.com/

Redmi Note 12 Pro : 5Gలో బెస్ట్ ఫోన్ ఇదేనా..? ఎగబడుతున్న వినియోదారులు..

అయితే మిగతా ఫోన్ల కంటే రెడ్ మీ నోట్  ఫీచర్స్ అద్భుతంగా ఉండడంతో వినియోగదారులు వీటిపై మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా ఇవి 5జీ నెట్ వర్క్ తో పాటు హై లెవల్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 4, 2023 / 12:09 PM IST
    Follow us on

    Redmi Note 12 Pro : చాలా మంది ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు.  వినియోగదారుల అవసరాలను భట్టి ఫోన్ల కంపెనీలో వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఉన్నత వర్గాల నుంచి సామాన్యులు సైతం స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేలా తక్కువ ధరలో మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు వివిధ మోడళ్లను ఇప్పటికే మార్కెట్లోకి తెచ్చింది చైనాకు చెందిన రెడ్ మీ కంపెనీ. వీటిలో 12 ప్రో సిరీస్ బాగా ఆకట్టుకుంటోంది. 5G నెట్ వర్క్ తో ఉండే ఈ మొబైల్ గత అక్టోబర్ 28న మార్కెట్లోకి వచ్చింది. అద్భుతమైన ఫీచర్లు ఉండడంతో వినియోదారులకు ఇది బాగా కనెక్ట్ అయింది. మరి దీని ఫీచర్స్, ధర ఎంతో తెలుసుకుందామా..

    రెడ్ మీ నోట్ 12 ఫ్రో, 12 ఫ్రో ప్లస్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. 12 ఫ్రో ప్లస్ 5G మొబైల్ ఫీచర్స్ ను పరిశీలిస్తే రామ్ 8 జీబీ నుంచి 12 జీబీ వరకు ఉంటుంది.  6.67 అంచుల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే, 200 ఎంపీ, 8 ఎంపీ, 2ఎంపీ ,16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 4980 ఎంఎఎహ్ లిథియం పాలిమర్ బ్యాటరీ, మీడియాటెక్ 1080 ప్రాసెసర్ ఉంది. దీని ధర రూ. 29,999 ఆన్ లైన్లో విక్రయిస్తున్నారు.

    రెడ్ మీ 12 ఫ్రో పీచర్స్ ను పరిశీలిస్తే 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో కూడుకొని ఉంది. 6.67 అంచుల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే, 4980 ఎంఎఎహ్ లిథియం పాలిమర్ బ్యాటరీ, మీడియాటెక్ 1080 ప్రాసెసర్ ఉంది.అయితే దీని ధర రూ.27,999 నుంచి విక్రయిస్తున్నారు.

    అయితే మిగతా ఫోన్ల కంటే రెడ్ మీ నోట్  ఫీచర్స్ అద్భుతంగా ఉండడంతో వినియోగదారులు వీటిపై మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా ఇవి 5జీ నెట్ వర్క్ తో పాటు హై లెవల్ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. 20 వేలకు పైగా బడ్జెట్ పెట్టేవాళ్లు రెడీ మీ నోట్ మంచి ఆప్షన్ అని చెబుతున్నారు.