Health Tips: తినే ఆహారపు అలవాట్లే మానవుల ఆరోగ్యానికి హాని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం మారిన విధానాలే ఎన్నో వ్యాధులకు మూల కారణాలు అంటారు వైద్యులు. బిజీ లైఫ్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్యానికి ఏ విధమైన ఆహారం బెస్ట్? అనే విషయాలను పట్టించుకోవడం లేదు. సరిగ్గా వంట చేయని వారు కూడా ఉన్నారు. వంటలు చేయకుండా హోటల్ కు అలవాటు పడి కర్రీ పాయింట్ల నుంచి కర్రీలు తెచ్చుకొని తినే వారు చాలా మందే ఉన్నారు.
ఇక కొందరు ఏకంగా ఆ కర్రీలను ఫ్రిజ్ లో పెట్టి మరీ మూడు రోజులు అయినా తింటారు. లేదంటే ఇంట్లోనే ఒక రోజు వంట చేసి వాటిని రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో పెడుతూ వేడి చేస్తూ తినే వారు కూడా చాలామంది ఉన్నారు. బిజీ బిజీ బిజీ అంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో చేరితే మూడు నాలుగు రోజులు అయినా లీవ్ పెట్టాల్సిందే. అంతకు తగిన డబ్బులు చెల్లించాల్సిందే. కానీ వీటిని ఆలోచించకుండా ఆహార అలవాట్లను పాడు చేసుకుంటున్నారు ప్రజలు.
అయితే వేడి చేస్తూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని.. చల్లటి ఆహారం మళ్లీ వేడి చేయడం వల్ల అందులోని ప్రోటీన్లు, విటమిన్లు నశిస్తాయి అంటున్నారు నిపుణులు.అంతేకాదు ఇలాంటి ఆహార పదార్థాలు కొన్ని సార్లు విషంగా మారుతాయి అని హెచ్చరిస్తున్నారు. మరి మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఇకనైనా మానుకోండి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి.
ఎప్పటికప్పుడు వేడి వేడిగా వండుకుని తినడమే ఆరోగ్యానికి మంచిది. అయితే డైరెక్ట్ తినడం ఇష్టం లేకనే వేడి చేసి వండుకుని తింటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల కూడా అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. అయినా కూడా ఒకసారి ఉడకబెట్టి తినవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ ఒకసారి వండిన అన్నం, సాంబార్ ఇతర వంటకాలను మళ్లీ మళ్లీ మాత్రం వేడి చేసుకొని తినకూడదు అని హెచ్చరిస్తున్నారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Can foods be heated and eaten
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com