Homeఎంటర్టైన్మెంట్Mogalirekulu Sagar: వీడికి బలుపు ఎక్కువ అన్న సీనియర్ నటి... మొగలి రేకులు సాగర్ కి...

Mogalirekulu Sagar: వీడికి బలుపు ఎక్కువ అన్న సీనియర్ నటి… మొగలి రేకులు సాగర్ కి ఇంత అవమానం జరిగిందా?

Mogalirekulu Sagar: బుల్లితెరపై మొగలి రేకులు సీరియల్ తో ఆర్కే నాయుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు నటుడు సాగర్. సీరియల్ నటుడిగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సాగర్ సీరియల్స్ వదిలేసి వెండితెర పై అడుగు పెట్టాడు. అలా పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన మెయిన్ లీడ్ గా నటించిన ఈద్ ముబారక్ కరోనా సమయంలో ఓటిటీ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ‘ దీ 100 ‘ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సీరియల్స్ చేస్తున్న సమయంలో ఓ సీనియర్ నటి అతన్ని దారుణంగా తిట్టిందట. నీకెంత బలుపు అంటూ అతనిపై సీరియస్ అయిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాగర్ వెల్లడించారు. ఆమె సాగర్ పై ఎందుకు సీరియస్ అయింది? ఆ సీనియర్ నటి ఎవరు? అనే వివరాల్లోకి వెళితే .. తాజా ఇంటర్వ్యూలో చక్రవాకం తర్వాత మొగలిరేకులు సీరియల్ లో మీకు ఎలా అవకాశం వచ్చింది అని యాంకర్ ప్రశ్నించారు.

సాగర్ మాట్లాడుతూ .. చక్రవాకం సీరియల్ తర్వాత కెరీర్ లో ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అయ్యాను. అదే సమయంలో ఓ తమిళ్ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. సీనియర్ నటి రమాప్రభ నన్ను రికమెండ్ చేసి .. ఆ తమిళ్ సీరియల్ లో అవకాశం ఇప్పించారు. డేట్స్ అన్ని ఫిక్స్ అయ్యాక నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. దీంతో రమాప్రభ గారికి కోపం వచ్చింది. నిజానికి చెన్నై నాకు కొత్త, పైగా యాక్టింగ్ స్కూల్ లో నేను నేర్చుకున్న దానికి బయట యాక్టింగ్ కి చాలా తేడా ఉంది.

డ్రామా స్కూల్ లో సహజంగా నటించడం నేర్పించారు. సీరియల్స్ లో మాత్రం డ్రమటిక్ గా నటించాలి. ఈ కారణాల వల్లే నేను చెన్నై వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత ఒక రోజు మొగలిరేకులు సీరియల్ స్టార్ట్ కాగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. సెట్ లోకి అనుకోకుండా రమాప్రభ గారు వచ్చారు. ఇక ఆవిడ మొగలిరేకులు సీరియల్ టీంతో ఈ అబ్బాయికి చెన్నైలో మంచి ఛాన్స్ ఇప్పిస్తే వెళ్లలేదు. ఇతనికి చాలా బలుపు, హీరోగా నటించే ఛాన్స్ వదులుకున్నాడు అంటూ నాపై కోప్పడ్డారు. నేను మాత్రం సైలెంట్ గా ఉండిపోయాను అంటూ సాగర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular