Black Turmeric: పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు చాలా మేలు చేస్తాయి. అందుకే వంటింట్లో కచ్చితంగా పసుపు ఉంటుంది. ఇక నల్ల పసుపు గురించి మీకు తెలిసే ఉంటుంది. దీనికి చాలా విలువ ఉంటుంది. ఈ నల్ల పసుపు వివిధ సమస్యలకు పరిష్కారం కూడా. ఇక నల్ల పసుపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ను కూడా దూరం చేస్తుంది. అంతేకాదు ఆర్థిక శ్రేయస్సుకు బాటలు వేస్తుందని నమ్ముతారు. మరి దీని లాభాలు ఓ సారి మీరే చూడండి.
ఈ నల్ల పసుపును తాంత్రిక పూజలు, వశీకరణ, ధనాకర్షణ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇది నర్మదా నది తీర ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లోని తూర్పు కనుమల్లో మాత్రమే లభిస్తుంది. ఇక ఇప్పుడు ఆన్ లైన్ లోకి కూడా వచ్చేసింది. నల్ల పసుపు కొమ్ములు గుమ్మానికి కడితే దుష్ట శక్తులు రావు. ఈ నల్ల పసుపును శనివారం పూజ చేసి బీరువా లేదా గల్ల పెట్టాలో పెడితే ధన లాభం వస్తుంది. గురు-పుష్య నక్షత్రం రోజు నల్ల పసుపును ఎర్రటి వస్త్రంలో కట్టి పూజ గదిలో పెట్టాలట. దైవ పూజ తర్వాత దీన్ని ఇంట్లో సురక్షితమైన స్థానంలో పెట్టాలి.
డబ్బు ఉన్న ప్రదేశంలో పెట్టాలి. నల్ల పసుపు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. నల్ల పసుపు గోమతీ చక్రం, వెండి నాణెం, ఆవు పాలు వంటివి పసుపు రంగు వస్త్రంలో చుట్టి అల్మారాలో పెట్టుకోవాలి. దీని వల్ల ఆర్థికంగా పుంజుకుంటారు. కొందరు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. అయితే ఈ నల్ల పసుపు వృథా ఖర్చులను తగ్గిస్తుంది. నల్ల పసుపు, కుంకుమ, సింధూరం వంటివి ఒక వెండి పెట్టెలో పెట్టి ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవి పాదాల చెంత ఆ పెట్టను పెట్టాలి.
ఈ పెట్టెను ఇంటికి తీసుకొని వెళ్లి డబ్బు ఉండే ప్రదేశంలో ఉంచాలి. శుక్లం పక్షం మొదటి శుక్రవారం ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి కూడా ఈ నల్ల పసుపు మంచి ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం రోజు వచ్చే గణేష్ చతుర్దశి, అమావాస్య రోజు నల్ల పసుపు, వెండి నాణేన్ని పసుపు వస్త్రంలో చుట్టి పూజ మందిరంలో ఉంచాలి. దాన్ని అక్కడే భద్రంగా ఉంచితే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అంటారు నిపుణులు.