https://oktelugu.com/

Pushpa: పుష్ప సినిమాలో కేశవ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

'కలర్ ఫోటో' అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సుహాస్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి పేరునైతే సంపాదించుకుంటున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 27, 2024 / 09:39 AM IST

    Pushpa

    Follow us on

    Pushpa: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వైవిధ్యమైన కథాంశాలతో యంగ్ హీరోలు సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘కలర్ ఫోటో’ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సుహాస్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి పేరునైతే సంపాదించుకుంటున్నాడు.

    ఇక ఇప్పటికే ఆయన చేసిన రైటర్ పద్మభూషణ్ , అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ లాంటి సినిమాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ అనే సినిమాని చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రీసెంట్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ “సుహాస్ మంచి నటుడు అంటూ చెబుతూనే నేను చేసిన పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ నేను కలిసి సుహాస్ ను తీసుకుందాం అనుకున్నాం..కానీ సుహాస్ కలర్ ఫోటో సినిమా చేసి మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆయన్ని తీసుకోవాడానికి ధైర్యం చేయలేకపోయాం.

    ఎందుకంటే హీరోగా చేసిన తర్వాత ఇలాంటి ఒక పాత్రలో చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశ్యం తో మేము సుహస్ ను అడగలేదు ” అంటూ మాట్లాడాడు.అలాగే సినిమా ఇండస్ట్రీలో నాని ని నాచురల్ స్టార్ గా పిలుస్తూ ఉంటారు. సుహాస్ కూడా నాని లాగే మంచి స్టార్ హీరో అవుతాడని అనిపిస్తుంది. ఇక సుహాస్ ని మట్టి హీరో అనాలేమో ఎందుకంటే ఆయన చేసే పాత్రలన్నీ చాలా రియలేస్టేక్ గా ఉండడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడి ని చాలావరకు ఆకట్టుకుంటాయి అంటూ సుకుమార్ సుహస్ మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి…

    ఇక ఇదిలా ఉంటే ‘ప్రసన్న వదనం’ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాతో కూడా సుహాస్ మరోసారి సక్సెస్ ని సాధిస్తాడు అంటూ చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా మీద మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…