Extramarital Affair: వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వివాహానికి ముందు భర్త జరిపిన వ్యవహారం ప్రాణాల మీదకు తెచ్చింది. కామం కట్టుదాటి ఓ కుటుంబాన్ని కబళించింది. వివాహ బంధంతో కొత్త జీవితానికి అడుగులు వేస్తున్న నవ వధువు ఆశలను తుంచేసింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన కోనసీమ జిల్లాలో వెలుగుచూసింది. పెళ్లికి ముందు భర్త పెట్టుకున్న సంబంధం ఓ అమాయకురాలిని బలిగొంది. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2 తల్లీ కూతుళ్లు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. తొలుత ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని భావించినా.. పోలీసులు మాత్రం అనుమానాస్పద కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీస్ విచారణలో మాత్రం షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కొమరగిరిపట్నానికి చెందిన మేడిశెట్టి సురేష్ కు అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే కొంతకాలంగా వారిద్దరి మధ్య సంబందాలు బెడిసికొట్టాయి. ఆమెను సురేష్ దూరం పెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన జ్యోతిని సురేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో నాగలక్ష్మి ముఖం చూడడమే మానేశాడు. ఈ పరిణామాలతో నాగలక్ష్మి కలత చెందింది. ఎలాగైనా జ్యోతి నుంచి సురేష్ ను వేరు చేయాలని ప్రయత్నించింది. సురేష్ కు ఆకాశరామన్న ఉత్తరాలు పంపించేది. నీ భార్య జ్యోతికి వివాహేతర సంబంధాలున్నాయని.. ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అంటూ అందులో రాసింది. కానీ అవేవీ సురేష్ పట్టించుకోలేదు. జ్యోతితో అన్యోన్యంగా జీవితం గడిపేవాడు. వారిని ఎంత విడదీయాలని ప్రయత్నించినా జరగకపోవడంతో నాగలక్ష్మి పగతో రగిలిపోయింది. జ్యోతిని మట్టుబెడితే కానీ సురేష్ తన దరికి రాడని నిర్ణయించుకుంది. ఇందుకుగాను అదును కోసం వేచిచూసింది.
Also Read: Kishan Reddy- Pawan Kalyan: కిషన్ రెడ్డి పిలిచినా పవన్ వెళ్లలేదా? కారణమేంటి?
సవతి కూతుళ్ల సాయంతో..
ఈ నేపథ్యంలో జ్యోతి ఈ నెల 2న తన పుట్టింటికి వెళ్లడం నాగలక్ష్మి గమనించింది. సవతి కూతుళ్లు సౌజన్య, దివ్య; హరితలతో కలిసి జ్యోతిని చంపేయాలని నిశ్చయించుకుంది. జ్యోతి తల్లి మంగాదేవితో ఇంట్లో పడుకొని ఉండగా నలుగురూ పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు వ్యాపించి జ్యోతి, మంగాదేవిలు సజీవ దహనమయ్యారు. దీనిపై జ్యోతి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మరణంగా భావించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త సురేష్ వ్యవహార శైలిపై కన్నేశారు. గత పరిణామాలను తవ్వుతూ వచ్చారు. ఈ క్రమంలో నాగలక్ష్మి పాత్రను గమనించి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. చివరకు పోలీసుల అనుమానమే నిజమైంది. తామే హత్య చేసినట్టు నాగలక్ష్మితో పాటు ఆమె సవతి కూతుళ్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆ నలుగురు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. పెళ్లికి ముందు సురేష్ నడిపిన వివాహేతర సంబంధం తల్లీ కూతుళ్ల ఉసురుతీసిందంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: Bhavadeeyudu Bhagat Singh: భవదీయుడు భగత్ సింగ్ లో మరో క్రేజీ హీరో
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: He burnt his wife and aunt for her boyfriend a married woman
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com