నాగబాబు, పోసాని.. సడన్ ఛేంజ్?

టాలీవుడ్ మారుతోంది. మునుపటి వాసనలు పోగొట్టుకుంటోంది. గతానికి భిన్నంగా ముందుకెళుతోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ అంటే తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రబాబు వెంటే టాలీవుడ్ సినీ జనాలు ఉండేవారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ అయ్యాక మారారు. జగన్ సీఎంగా ఎక్కి ఏడాది దాటాక ఆయనను కలుసుకునేందుకు వచ్చి షూటింగ్ లకు పర్మిషన్ తీసుకెళ్లిపోయారు. ఇక మొన్నటి ఎన్నికల వేళ జగన్ ను, వైసీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు మెగా బ్రదర్స్, […]

Written By: NARESH, Updated On : June 11, 2020 3:50 pm
Follow us on


టాలీవుడ్ మారుతోంది. మునుపటి వాసనలు పోగొట్టుకుంటోంది. గతానికి భిన్నంగా ముందుకెళుతోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ అంటే తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రబాబు వెంటే టాలీవుడ్ సినీ జనాలు ఉండేవారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ అయ్యాక మారారు. జగన్ సీఎంగా ఎక్కి ఏడాది దాటాక ఆయనను కలుసుకునేందుకు వచ్చి షూటింగ్ లకు పర్మిషన్ తీసుకెళ్లిపోయారు.

ఇక మొన్నటి ఎన్నికల వేళ జగన్ ను, వైసీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు మెగా బ్రదర్స్, జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాగబాబులు.. ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అవుతోంది. మెగా బ్రదర్ నాగబాబు ఏకంగా జగన్ ను మెచ్చుకున్నాడు. చంద్రబాబు, టీడీపీ తిట్ల వర్షం కురిపించాడు. ఇది సినీ, రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు.. టీడీపీకి అనుకూలంగా బాకా ఊదే పచ్చ మీడియా సంస్థలకు ఏపీ సీఎం జగనే కరెక్ట్ మొగుడని మెగాబ్రదర్ నాగబాబు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తొలి నుంచి వైసీపీని, జగన్ ను తమ వ్యతిరేకిగా భావించి జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబులు విమర్శించడం ప్రజలు చూస్తునే ఉన్నారు. అయితే తాజాగా మెగాబ్రదర్ నాగబాబు సడెన్ గా ఫ్లేటు ఫిరాయించాడు. సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఆయనకు ఎందుకిలా వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ, సినీ ప్రముఖుల్లో మొదలైంది.

ఇక పోసాని కూడా తొలిసారి తన తప్పు తెలుసుకొని సారీ చెప్పడం టాలీవుడ్ లో మరో విశేషం. 50 లక్షల రూపాయల లంచం ఇస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని.. ఇదే కేసులో రేవంత్ జైలుకు వెళ్లారని.. అలాంటి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ను విమర్శించే అర్హత లేదని పోసాని ఆదివారం నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ లాంటి మంచి నాయకుడిని రేవంత్ లాంటి నాయకుడు విమర్శించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మంచి నాయకులపై ఆరోపణలు చేయడం మంచిది కాదని రేవంత్ రెడ్డికి పోసాని హితవు పలికారు. కేటీఆర్ పై ఆధారాలు చూపిస్తే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేస్తానని పోసాని సవాల్ చేశారు.

అయితే రేవంత్ రెడ్డి తాజాగా కేటీఆర్ ఫాంహౌస్ అక్రమాలపై కొన్ని ఆధారాలను విలేకరుల సమావేశంలో చూపెట్టడం.. రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోసాని తన విమర్శలను వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో రేవంత్ రెడ్డిని అవమానించేలా మాట్లాడడం సరైంది కాదని.. తాను ఎటువంటి చెడు వ్యాఖ్యలు చేయలేదని పోసాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికార పార్టీపై ఆరోపణలు చేసేటప్పుడు సరైన సాక్ష్యాలు ఉండాలనే తాను సలహా ఇచ్చానని పోసాని తెలిపారు.

ఇలా టాలీవుడ్ సినీ జనాలు జగన్ ను కలవడం.. ఎప్పుడూ జగన్ ను తిట్టిపోసే మెగా బ్రదర్ నాగబాబు తొలిసారి జగన్ కు మద్దతు పలకడం.. ఇక తెలంగాణ రాజకీయాలపై నోరుపారేసుకొని పోసాని క్షమాపణ చెప్పడం.. ఇలా మూడు సంఘటనలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మూడు భిన్నమైన వైఖరిని తీసుకోవడం చర్చనీయాంశమయ్యాయి.

–నరేశ్ ఎన్నం