
మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజా పరిస్థితులు, రాజకీయాలు, సినిమాలపై నాగబాబు చేసే కామెంట్స్ వివాదం అవడంతోపాటు చర్చనీయాంశంగా మారుతోన్నాయి. ఇటీవల నాగబాబు తన ట్వీటర్లో ‘గాడ్సే.. దేశ భక్తుడు’ అంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెల్సిందే. అదేవిధంగా బాలకృష్ణ నోరుజారి భూములు పంచుకున్నారా అన్న మాటలకు కౌంటర్ గా నాగాబాబు ‘మీరేమీ కింగ్ కాదు.. జస్ట్ హీరో’ అని కామెంట్ చేయడంతో టాలీవుడ్లో రచ్చ మొదలైంది. నాగబాబు వర్సెస్ బాలయ్య ఇష్యూగా మారిన సంగతి తెల్సిందే. నాగబాబుపై బాలకృష్ణ ఫ్యాన్స్ ఇష్టంమొచ్చిన రీతిలో కామెంట్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో వివాదం మరింత ముదిరిన సంగతి తెల్సిందే..
తాజాగా నాగబాబు తన ట్వీటర్లో టీడీపీపై బాంబు పేల్చారు. ఈ ట్వీట్ వైసీపీకి అనుకూలంగా ఉండటంతో వైసీపీ శ్రేణులు కూడా నాగబాబుకు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాకు జగనే కరెక్ట్ అనిపిస్తుందంటూ ఆయన ట్వీటర్లో కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబులు తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. టీడీపీ అనుసరిస్తున్న నీచ రాజకీయాల వల్లే నాగబాబు వైసీపీకి అనుకూలంగా కామెంట్స్ చేసినట్లు కన్పిస్తుంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మంగళవారం చిరంజీవి నేతృత్వంలో సినీపెద్దలు కలిసిన సంగతి తెల్సిందే. అయితే బాబుకు బాకాలుదే పచ్చమీడియా ప్రతికూల ప్రసారాలు చేయడంతో నాగబాబు హార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎంతో బేటి కావడానికి ముందు చిరంజీవి, సినీ ప్రముఖులు బస చేసిన గెస్ట్ హౌజ్ ముందు కొందరు మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ అంశాన్ని ప్రసారం చేస్తూ చిరంజీవిని టార్గెట్ చేసేలా కథనాలు ప్రసారం చేయడంపై నాగబాబు మండిపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన సోషల్ మీడియాలో బాబుకు అనుకూలంగా ఉండే ‘కుల’ మీడియాపై సైటర్లు వేశారు.
‘టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం, మన వాడు చంద్రబాబు నాయుడుగారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం, మనబాబు కి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని.. బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ.. బాబోరి +
ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ, బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే’ అంటూ నాగబాబు తన ట్వీటర్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని,టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం,మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం ,మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం,మనబాబు కి ఉపయోగపడినంత కాలం..contd
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 9, 2020
ఓడ మల్లయ్య అని,, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ,, బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ,బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా..contd
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 9, 2020
పత్రికల స్పిరిట్ అంటే..శభాష్…(ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని doubt వస్తుందేంటి)
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 9, 2020