https://oktelugu.com/

‘రైతుబంధు పేరుతో కేసీఆర్ కొత్త మోసం!’

రైతు బంధు పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో అవినీతికి తెరతీశాడని బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తెలంగాణలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారని.. ఇప్పుడు అవసరాలు, డిమాండ్, సప్లై అని కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మొక్కజొన్న రైతులు మనస్తాపానికి గురయ్యారని చెప్పారు. బీజేపీతో పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని హెచ్చ‌రించారు. వలస కార్మికుల వ్యవహారంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 10, 2020 6:56 pm
    Follow us on

    Bjp arvindh

    రైతు బంధు పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో అవినీతికి తెరతీశాడని బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తెలంగాణలో వరి పంట ఎక్కువగా సాగు చేస్తారని.. ఇప్పుడు అవసరాలు, డిమాండ్, సప్లై అని కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మొక్కజొన్న రైతులు మనస్తాపానికి గురయ్యారని చెప్పారు.

    బీజేపీతో పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని హెచ్చ‌రించారు. వలస కార్మికుల వ్యవహారంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ వర్గాలకు బాసటగా ఇస్తామని తేల్చిచెప్పింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని వివరించారు.

    పోతిరెడ్డిపాటు సామర్థ్యం పెంచుతామని ఏపీ సర్కార్ జీవో ఇచ్చిన సీఎం కేసీఆర్ మిన్నకుండిపోయారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైరయ్యారు. ఇప్పటివరకు కంపెనీలు/పరిశ్రమలను బెదిరించిన కేసీఆర్.. ఇప్పుడు రైతులను బెదిరిస్తున్నారని విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిప‌డ్డారు. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కృష్ణ జలాలను జగన్‌కు కేసీఆర్ అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.