Rajareddy : సినిమా హీరో కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సక్సెస్ అయ్యేది కొందరే. హీరోగా ఎదిగితే ఆ నేమ్, ఫేమ్, స్టార్డం ఓ రేంజ్ లో ఉంటాయి. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. హీరోలు సొసైటీకి రోల్ మోడల్ గా ఉంటారు. చెప్పాలంటే హీరోలను ప్రత్యక్ష దైవాలుగా పూజించే అభిమానులు ఉన్నారు. కోట్ల సంపాదన వద్దన్నా వచ్చి పడుతుంది. ఇంకా దశ తిరిగితే సీయమ్మో పీయమ్మో ఐపోవచ్చు. హీరో అయితే ఒనగూరే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అందుకే నటుల వారసులే కాకుండా దర్శక నిర్మాతలు, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్ పిల్లలు కూడా హీరోలుగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.