Raghuvaran Btech: ఏ హీరోకి అయినా బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడాలంటే, కచ్చితంగా యూత్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలే చెయ్యాలి. అలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేసేవాడు, అందుకే ఆయనకు అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత రామ్ ఆ రేంజ్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు, కెరీర్ ప్రారంభం లో దేవదాస్, రెడీ వంటి భారీ కమర్షియల్ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం వల్ల, బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ, ఇంకా మీడియం రేంజ్ మార్కెట్ తోనే కొనసాగుతున్నాడు. మధ్యలో ఎన్నో సూపర్ హిట్ సబ్జక్ట్స్ ని రామ్ పోతినేని వదిలేసాడట. అలాంటి సినిమాల్లో ‘రఘువరన్ BTECH’ అనే చిత్రం కూడా ఉంది. తమిళ హీరో ధనుష్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా తెలుగు, తమిళ భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ధనుష్ ని మన తెలుగు యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన చిత్రమిది. అంతే కాకుండా కల్ట్ క్లాసిక్ గా కూడా పేరు తెచుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో దబ్ చేసే ముందు రామ్ తో రీమేక్ చెయ్యాలని అనుకున్నారట. డైరెక్టర్ గా కిషోర్ తిరుమల ని ఎంచుకున్నారు. కానీ రామ్ ఎందుకో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. రీమేక్ సినిమాలు అప్పట్లో బాగానే వర్కౌట్ అయ్యేవి. ఇప్పుడైతే ఓటీటీ ఉండడం తో అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు అన్ని రకాల సినిమాలు చూసేస్తున్నారు కాబట్టి రీమేక్స్ వర్కౌట్ అవ్వడం లేదు. ఆరోజుల్లో ఓటీటీ లాంటివి ఏమి లేవు. రీమేక్ ని మంచిగా తీస్తే కాసుల కనకవర్షమే కురిపించేవి. అలా ఈ సినిమాని రామ్ రీమేక్ చేసుంటే ఆయన కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ మూవీ గా మిగిలిపోయేది. అంతే కాకుండా రామ్ ని స్టార్ హీరో స్టేటస్ కి చాలా దగ్గరగా చేర్చి ఉండేది ఈ చిత్రం.
కానీ ఆయన ఇలాంటి సినిమాలు వదిలేసి మసాలా, పండగ చేస్కో లాంటి అవుట్ డేటెడ్ సినిమాలు చేసేవాడు. ఫలితంగా కెరీర్ మొత్తం మీద అక్కడక్కడా మాత్రమే హిట్లు, ఎక్కువ శాతం ఫ్లాపులు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రామ్ అభిమానులకు ఈ విషయం లో తమ హీరో ని తిడుతూ ఉంటారు. అతనికి ఉన్న టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ కి స్టార్ హీరో గా ఎప్పుడో నిలబడాల్సిన వాడు, ఇంకా చెత్త సినిమాలు చేస్తూ ఎక్కడ మొదలయ్యాడో, అక్కడే ఆగిపోయాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.