https://oktelugu.com/

Yash : హీరో యశ్ కి అక్క గా నటిస్తున్న రజినీకాంత్ హీరోయిన్…

Yash : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే...

Written By: , Updated On : March 24, 2025 / 08:53 AM IST
Yash

Yash

Follow us on

Yash : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్న హీరోలందరూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అభిమానిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న యశ్ మాత్రం మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. అయితే ‘కేజీఎఫ్ 2’ సినిమా తర్వాత ఆయాన చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మరి మరోసారి ‘టాక్సీక్ ‘ (Toxic) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 19వ తేదీన రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి దాదాపు ఇంక సంవత్సరం సమయం ఉంది. అందుకే ఈ సినిమాని చాలా పకడ్బందీ ప్రణాళికతో రూపొందించి మరి తప్పకుండా సక్సెస్ ఫుల్ సినిమాగా నిలపడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో యశ్ (Yash) అక్కగా నయనతార (Nayan thara) నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు స్టార్ హీరోలందరితో పోటీపడుతూ మరి నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే సంపాదించుకుంటుంది.

Also Read : కియారా అద్వానీ పై ‘కేజీఎఫ్’ హీరో యాష్ ఫైర్..ఆమె వల్ల మొత్తం నాశనం అంటూ కామెంట్స్!

ఇక ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో కూడా హీరోలందరికి పోటీనీ ఇస్తూ తను ఒక సినిమాలో నటిస్తుంది అంటే ఆ సినిమా మీద యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి భారీ అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోయిన్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి యశ్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో అటు యష్, ఇటు నయనతార ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారు. తద్వారా వాళ్ళకి ఇండియాలో ఎలాంటి గుర్తింపు వస్తుంది వాళ్ళు చేయబోతున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయి.

తద్వారా వాళ్లకు భారీ సక్సెస్ దక్కుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నయనతార చేస్తున్న ప్రతి సినిమా హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే ఆమె డిఫరెంట్ పాత్రలను చేసుకుంటు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిగా నటించి మెప్పించే ప్రయత్నమైతే చేస్తుంది…

Also Read : కెజిఎఫ్ స్టార్ యష్ కీలక నిర్ణయం, నిరాశలో ఫ్యాన్స్! సంచలన లేఖ విడుదల