https://oktelugu.com/

Chiranjeevi and Anil Ravipudi : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

Chiranjeevi and Anil Ravipudi : ఇప్పటివరకు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ భారీ గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి చిరంజీవికి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

Written By: , Updated On : March 24, 2025 / 08:58 AM IST
Chiranjeevi , Anil Ravipudi

Chiranjeevi , Anil Ravipudi

Follow us on

Chiranjeevi and Anil Ravipudi : ఇప్పటివరకు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ భారీ గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి చిరంజీవికి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆయనలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన డాన్స్ తో షేక్ చేసినటువంటి నటుడు కూడా తనే కావడం విశేషం…ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఫైట్లు, డ్యాన్స్ లు చేస్తూ యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు…

గత 50 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు చిరంజీవి(Chiranjeevi)… ఆయన వరుస విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న చిరంజీవి మరోసారి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే విశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న ‘విశ్వంభర ‘ (Vishvambhara) సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే చిరంజీవి స్టార్ హీరో గా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో సాంగ్ పాడనున్న లెజెండరీ సింగర్…

మరి ఇప్పుడున్న స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్న నేపధ్యం లో చిరంజీవి సైతం పాన్ ఇండియా మార్కెట్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాబోయే సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ మరోసారి మెగాస్టార్ తన పంజా దెబ్బను బాక్సాఫీస్ కి రుచి చూపించాల్సిన అవసరమైతే ఉంది… ఇక విశ్వంభర సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. అయితే ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అనిల్ రావిపూడి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు.

తను అనుకున్నట్టుగానే తొందరగా సినిమాను చేసి భారీ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. చిరంజీవి ని డైరెక్షన్ చేయాలనేది తన డ్రీమ్ అని అనిల్ రావిపూడి చాలా సందర్భాల్లో తెలియజేశాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది

Also Read : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫస్ట్ హాఫ్ లాక్..ఆసక్తికరమైన టైటిల్ తో ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!