https://oktelugu.com/

Yash: కెజిఎఫ్ స్టార్ యష్ కీలక నిర్ణయం, నిరాశలో ఫ్యాన్స్! సంచలన లేఖ విడుదల

హీరో యష్ తన అభిమానులకు ఝలక్ ఇచ్చాడు. యష్ నిర్ణయం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఈ మేరకు యష్ విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ లేఖలో ఏం రాశారో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : December 31, 2024 / 08:12 AM IST

    Yash

    Follow us on

    Yash: కెజిఎఫ్ సిరీస్ తో హీరో యష్ ఇండియా వైడ్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. 2018లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడిక్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా యష్ రూపొందించారు. రాకీ పాత్రలో యష్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశాడు. విడుదలైన అన్ని భాషల్లో యష్ ఆదరణ దక్కించుకుంది. కెజిఎఫ్ పార్ట్ వన్ విడుదలైన నాలుగేళ్లకు 2022లో కెజిఎఫ్ 2 విడుదల చేశారు. మొదటి భాగానికి మించిన ఆదరణ రెండో భాగానికి దక్కింది. కెజిఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది.

    యష్ ఇమేజ్ ఎల్లలు దాటేసింది. మరింత పాపులారిటీ ఆయనకు దక్కింది. కన్నడలో నెంబర్ వన్ హీరోగా యష్ ఎదిగాడు. కెజిఎఫ్ 2 విడుదల అనంతరం యష్ ఏడాది పాటు విరామం తీసుకున్నారు. కొత్త మూవీ ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. యష్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనంతరం టాక్సిక్ టైటిల్ తో యష్ మూవీ ప్రకటించారు. ఆయనతో చిత్రాలు చేసేందుకు బడా దర్శకులు ఎదురుచూస్తుండగా.. ఓ లేడీ డైరెక్టర్ కి ఆయన అవకాశం ఇవ్వడం విశేషం.

    టాక్సిక్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా అని సమాచారం. యష్ లుక్ ఆసక్తి రేపుతోంది. టాక్సిక్ చిత్రానికి గీతు మోహన్ దాస్ దర్శకురాలు. ఈ మూవీ 2025లో థియేటర్స్ లోకి రానుంది. కాగా జనవరి 8న యష్ బర్త్ డే. అభిమానులు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. వారి ఆశలపై యష్ నీళ్లు చల్లారు. తాను జన్మదిన వేడుకలకు అందుబాటులో ఉండనని స్పష్టత ఇచ్చాడు. అలాగే ఎవరూ హోమ్ టౌన్ కి రావొద్దని లేఖలో పొందుపరిచాడు.

    మీ ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు. కానీ మీ భద్రత, క్షేమం నాకు ముఖ్యం. షూటింగ్ లో బిజీగా ఉండటం వలన నేను జన్మదిన వేడుకల్లో పాల్గొనలేను. మీరు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయవద్దు. క్షేమంగా ఉండండి, అంటూ ఒక లేఖ విడుదల చేశారు. కాగా గత ఏడాది యష్ జన్మదిన వేడుకల్లో భాగంగా తమ గ్రామంలో బ్యానర్స్ కడుతూ ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కి గురై మరణించారు. ఈ విషాద ఘటనల నేపథ్యంలో యష్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడని సమాచారం.