MI Vs CSK (3)
MI Vs CSK: రోహిత్ శర్మ.. సూర్య కుమార్ యాదవ్.. రికెల్టన్.. విల్ జాక్స్.. రాబిన్ మిన్జ్, నమన్ ధార్.. చెప్పుకోవడానికి లైన్ అప్ బాగానే ఉంది.. వీరంతా అనామక ఆటగాళ్లు కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆటగాళ్లు.. అద్భుతాన్ని కళ్ళ ముందు ఉంచే ఆటగాళ్లు.. కానీ అటువంటి ఆటగాళ్లు తేలిపోయారు.. తాము ఐదుసార్లు ఐపీఎల్ కప్ గెలిచామనే విషయాన్ని మర్చిపోయారు.
Also Read: ఫస్ట్రేషన్ తగ్గలేదా రోహిత్తూ.. ఎందుకిలా ఆడుతున్నావ్?
అద్భుతం జరిగితే తప్ప చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs MI) జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవడం దాదాపు కష్టం. చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచింది. మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులను సమర్థవంతంగా అంచనా వేసిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) బౌలింగ్ ఎంచుకున్నాడు. అఫ్కోర్స్ దీని వెనుక ధోని ఉన్నాడు.. అది వేరే విషయం.. బౌలింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ఏ దశలోనూ ముంబై ఇండియన్స్ జట్టుకు గొప్పగా బ్యాటింగ్ చేసేంత సన్నివేశం ఇవ్వలేదు. నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టి ముంబై జట్టు పతనాన్ని శాసిస్తే.. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీసి తన వంతు పాత్ర పోషించాడు. మొత్తంగా ముంబై జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ చచ్చీ చెడి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (0) తీవ్రంగా నిరాశపరిచాడు. రికెల్టన్( 13), విల్ జాక్స్(11), రాబిన్ మిన్జ్(3), నమన్ ధార్(17), శాంట్నర్(11) విఫలమయ్యారు. దీపక్ చాహర్ (28), సూర్య కుమార్ యాదవ్ (29) పర్వాలేదనిపించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Telugu cricket player Tilak Verma) (31) టాప్ స్కోరర్ గా నిలిచాడు.. తిలక్ వర్మ గనుక నిలబడకపోయి ఉంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
విఫలమయ్యారు
ఐపీఎల్ లో ఉన్న పది జట్లలో.. ఎంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుగా ముంబై ఇండియన్స్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (0) సున్నా పరుగులకే అవుట్ కావడం అతని అభిమానులను సైతం షాక్ కు గురిచేస్తోంది. మరో ఓపెనర్ రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టి ఉత్సాహంగా కనిపించినప్పటికీ.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తిలక్ వర్మ మాత్రమే నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడం.. అతడు కూడా నూర్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో దీపక్ చాహర్(28) మెరుపులు మెరిపించడం వల్ల ముంబై జట్టు ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మరోవైపు ముంబై జట్టు విధించిన 156 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రంగంలోకి దిగిన చెన్నై జట్టు ఈ కథనం రాసే సమయం వరకు 4 ఓవర్లు పూర్తయిసరికి ఒక వికెట్ 35 పరుగులు చేసింది. చెన్నై జట్టు ఓపెనర్ రాహుల్ త్రిపాటి (2) దీపక్ చాహర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రచిన్ రవీంద్ర (14*), రుతు రాజ్ గైక్వాడ్(18*) క్రీజ్ లో ఉన్నారు.