Homeఎంటర్టైన్మెంట్Balayya missed No.1 position: బాలయ్య ఆ మూడు సినిమాలు చేసి ఉండకపోతే బాగుండేదా..?తను నెంబర్...

Balayya missed No.1 position: బాలయ్య ఆ మూడు సినిమాలు చేసి ఉండకపోతే బాగుండేదా..?తను నెంబర్ వన్ అయ్యేవాడా..?

Balayya missed No.1 position: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…తన ఎంటైర్ కెరియర్లో చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇక ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో బాలయ్య బాబు సైతం ముందు వరుసలో దూసుకెళ్తున్నాడు. వరుసగా నాలుగు విజయాలను సాధించిన బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు డీలా […]

Balayya missed No.1 position: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…తన ఎంటైర్ కెరియర్లో చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇక ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో బాలయ్య బాబు సైతం ముందు వరుసలో దూసుకెళ్తున్నాడు. వరుసగా నాలుగు విజయాలను సాధించిన బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు డీలా పడ్డప్పటికి ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు… ఈ సినిమాలతో భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక బాలయ్య బాబుకు చిరంజీవిని బీట్ చేసే అవకాశం కొన్నిసార్లు వచ్చింది. కానీ తను దానిని సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి.

1999 వ సంవత్సరంలో ‘సమర సింహారెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సాధించాడు. అప్పుడే చిరంజీవి సైతం ‘స్నేహం కోసం’ సినిమాని రిలీజ్ చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక అప్పుడు బాలయ్య చిరంజీవి మీద పై చేయి సాధించాడు.

ఇక బ్యాక్ టు బ్యాక్ ఒక రెండు సక్సెస్ లు పడి ఉంటే బాలయ్య బాబు కెరీర్ అనేది మారిపోయేది. నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకునేవాడు. కానీ ఆ తర్వాత ఆయన ఇవివి సత్యనారాయణ తో ‘గొప్పింటి అల్లుడు’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేక డిజాస్టర్ గా మారింది. ఇక ఆ తర్వాత వంశోద్ధారకుడు సినిమా చేశాడు.

ఆ సినిమా కూడా ఓకే అనిపించింది కానీ భారీ విజయాన్నైతే సాధించలేదు… 2001 వ సంవత్సరంలో నరసింహ నాయుడు సినిమా సమయంలో కూడా చిరంజీవిని బీట్ చేసే అవకాశమైతే వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన సీమ సింహం అనే సినిమా చేసి భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు… ఇలా బాలయ్య బాబు తొందరపడి చేసిన కొన్ని సినిమాలు అతన్ని భారీ డిజాస్టర్ల వైపు నడపడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక్కసారి కూడా తను నెంబర్ వన్ పొజిషన్ ను అందుకోకుండా చేశాయి…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper