Homeఎంటర్టైన్మెంట్Actor Shivaji Viral Video: యూట్యూబర్ అన్వేష్ ని వదిలేయండి అంటూ హీరో శివాజీ రిక్వెస్ట్..వీడియో...

Actor Shivaji Viral Video: యూట్యూబర్ అన్వేష్ ని వదిలేయండి అంటూ హీరో శివాజీ రిక్వెస్ట్..వీడియో వైరల్!

Actor Shivaji Viral Video: హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి శివాజీ(Actor Shivaji) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా యూట్యూబర్ అన్వేష్(Youtuber Anvesh) చేసిన నీచమైన కౌంటర్ అటాక్ కి నెటిజెన్స్ నుండి ఏ రేంజ్ వ్యతిరేకత ఎదురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతన్ని అడ్డమైన బూతులు తిట్టడమే కాకుండా, హిందూ దేవుళ్లను కించపరుస్తూ అత్యంత దారుణమైన కామెంట్స్ చేశాడు. అందుకు ఆయన ఎదురుకుంటున్న నెగటివిటీ ఎలాంటిదో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. అన్వేష్ అనే […]

Actor Shivaji Viral Video: హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి శివాజీ(Actor Shivaji) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా యూట్యూబర్ అన్వేష్(Youtuber Anvesh) చేసిన నీచమైన కౌంటర్ అటాక్ కి నెటిజెన్స్ నుండి ఏ రేంజ్ వ్యతిరేకత ఎదురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతన్ని అడ్డమైన బూతులు తిట్టడమే కాకుండా, హిందూ దేవుళ్లను కించపరుస్తూ అత్యంత దారుణమైన కామెంట్స్ చేశాడు. అందుకు ఆయన ఎదురుకుంటున్న నెగటివిటీ ఎలాంటిదో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. అన్వేష్ అనే పేరు కనిపిస్తే చాలు నెటిజెన్స్ కి చిరాకు కలుగుతోంది. ఇదంతా పక్కన పెడితే హీరో శివాజీ ‘బిగ్ బాస్ 7’ లోకి అడుగుపెట్టే ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఆయన మాట్లాడుతూ ‘యూట్యూబర్ అన్వేష్ మామూలోడు కాదమ్మా..ఒక్కసారి అయినా వాడిని కలవాలి, చాలా పెద్ద ఫ్యాన్ ని’ అంటూ చెప్పుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

అప్పట్లో అతని గురించి అంత గొప్పగా మాట్లాడిన శివాజీ ని, అన్వేష్ ఇంత నీచమైన వ్యాఖ్యలు చేయడం అమానవీయం అంటూ సోషల్ మీడియా లో అన్వేష్ పై నెటిజెన్స్ విరుచుకుపడ్డారు. అయితే శివాజీ రీసెంట్ గానే ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన అన్వేష్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముందుగా జాఫర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘అన్వేష్ గురించి మీరేమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా?’ అని అడగ్గా, అందుకు శివాజీ సమాధానం చెప్తూ ‘వదిలేద్దాం సార్..ప్రకృతి చూసుకుంటుంది. కర్మ కి ప్రతి కర్మ తప్పదు. కావాలని నోరు పారేసుకున్న వాళ్లకు ప్రకృతి దూల తీర్చేస్తుంది. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వృధా’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. అన్వేష్ లకారాలతో అడ్డమైన బూతులు తిట్టినప్పటికీ, ఎంతో మర్యాదగా అందుకు సమాధానం ఇచ్చిన శివాజీ పెద్దరికాన్ని చూసి సోషల్ మీడియాలో నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు.

జాఫర్ మరో ప్రశ్న అడుగుతూ ‘ఆరోజు స్టేజి మీద ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది?’ అని అడగ్గా, అందుకు శివాజీ సమాధానం చెప్తూ ‘ఎందుకో తెలియదు సార్. ఒక్కోసారి పదాలు జారిపోతూ ఉంటాయి. అలా నేను ఆ రెండు పదాలు జారినప్పుడు రెండు మూడు రోజులు దానిని తల్చుకొని చాలా బాధ పడ్డాను. ఇప్పటి వరకు ఎన్నో వందల ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్స్ పెట్టి ఉంటాను, ఎప్పుడూ అలా నోరు జారని నేను, ఎందుకు జారాను అంటూ తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకొని అక్కడితో ఆ విషయాన్ని వదిలేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper