https://oktelugu.com/

Devara: రాజమౌళి మీద ఉన్న బ్యాడ్ రికార్డ్ ను దేవర తో ఎన్టీయార్ క్లియర్ చేస్తాడా..?

తెలుగులో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికి దర్శక ధీరుడు అయిన రాజమౌళికి ఉన్న ప్రత్యేకత వేరే లెవల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు... ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమాని కూడా చేయడానికి సిద్ధమయ్యాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 20, 2024 / 01:40 PM IST

    Devara

    Follow us on

    Devara: ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామంది దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ తమను తాము స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మరి కొంత మంది మాత్రం వాళ్లకు సరైన గుర్తింపు లేక ఢీలా పడిపోతుంటారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ సాధించలేదు అనేదానిమీదనే చాలావరకు ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక మొత్తానికైతే ఆయన స్టార్ హీరోలతో చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకుంటాయి. కానీ ఆ తర్వాత ఆ స్టార్ హీరోలకు మాత్రం డిజాస్టర్లను కట్టబెడతాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం దర్శక ధీరుడిగా పేరు సంపాదించుకున్న రాజమౌళి తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. అయితే రాజమౌళి ఆయన కెరియర్ మొదటి నుంచి కూడా ఆయనతో సినిమా చేసి సక్సెస్ ని అందుకున్న హీరోకి ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవుతూ వస్తుంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్, ఎన్టీఆర్లు సైతం దీనికి దిగదుడుపుగా కనిపించడం లేదు. ఇక ఇప్పటికే ఆచార్య సినిమాతో రామ్ చరణ్ ఒక ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు.

    ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాటా వచ్చింది. దేవర సినిమాతో ఆయన సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే రాజమౌళి మీద ఉన్న బ్యాడ్ రికార్డ్ కి బ్రేక్ వేసినవాడు అవుతాడు. అలా కాకుండా ఆయన కూడా ఈ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకుంటే మాత్రం రాజమౌళి మీద ఉన్న ఆ బ్యాడ్ నేమ్ కి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం అయితే ఉంది.

    మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తాడు రాజమౌళి మీద ఉన్న అపవాదును తొలగిస్తాడా?లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక దేవర సినిమా ట్రైలర్ మీద కొంతవరకు డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ మొత్తానికైతే ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…