Trivikram Srinivas – Sunil: త్రివిక్రమ్ సునీల్ ను పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం ఇదేనా..?

ఇక దాంతో కొద్ది రోజుల పాటు సునీల్ హీరోగా మంచి సక్సెస్ లను అందుకున్నప్పటికి ఫైనల్ గా హీరోగా మాత్రం తనకు మంచి పేరు అయితే రాలేదు. ఇక దాంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ మంచి పేరును సంపాదించుకుంటున్నాడు.

Written By: Neelambaram, Updated On : January 19, 2024 3:06 pm

Trivikram Srinivas Sunil

Follow us on

Trivikram Srinivas – Sunil: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మాత్రం కొంతమంది మంచి ఫ్రెండ్స్ గా మారుతూ ఉంటారు. వాళ్లు కలిసి అవకాశాల కోసం ఆఫీసులో చుట్టూ తిరగడం, ఒకే రూమ్ లో ఉంటూ ఒకరి కష్టాన్ని మరొకరు షేర్ చేసుకుంటూ, డబ్బులు ఉన్నప్పుడు తినడం, లేనప్పుడు పస్తులు ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ గా చెప్పుకునే వాళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్( Sunil ) ఇద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ చాలా కష్టాలు పడుతూ వచ్చారు. ఇక త్రివిక్రమ్( Trivikram ) ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో రైటర్ గా తన సత్తా చాటుకుంటున్న సమయంలో ఆయన రాసిన ప్రతి సినిమాలో కూడా సునీల్ కోసం ప్రత్యేకమైన క్యారెక్టర్ ని డిజైన్ చేస్తూ ఉండేవాడు. అలా సునీల్ ని కూడా మంచి నటుడిగా నిలబెట్టడంలో త్రివిక్రమ్ తన వంతు పాత్రనైతే పోషించాడు. ఇక మంచి కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలోనే సునీల్ హీరో గా మారి కమెడియన్ వేషాలకి స్వస్తి చెప్పాడు.

Also read : మధుబాబు రాసిన ఆ బుక్ నుంచే త్రివిక్రమ్ ఈ సీన్ కాపీ చేశాడా..?

ఇక దాంతో కొద్ది రోజుల పాటు సునీల్ హీరోగా మంచి సక్సెస్ లను అందుకున్నప్పటికి ఫైనల్ గా హీరోగా మాత్రం తనకు మంచి పేరు అయితే రాలేదు. ఇక దాంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ మంచి పేరును సంపాదించుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ సునీల్ ని పెద్దగా పట్టించుకోనట్టుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సుకుమార్ లాంటి డైరెక్టర్ సునీల్ ని డిఫరెంట్ క్యారెక్టర్లలో చూపిస్తూ ఉంటే త్రివిక్రమ్ మాత్రం తనకోసం ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ని సృష్టించి ఐదు, పది నిమిషాల క్యారెక్టర్ ని తనకి ఇస్తున్నాడే తప్ప ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ని సునీల్ కోసం ఇవ్వడం లేదు.

Also read : త్రివిక్రమ్ కి క్యాస్ట్ పిచ్చి ఉందా..? అందుకే వీళ్లని తన సినిమాల్లో తీసుకుంటాడా..?

ఇక ఈ క్రమంలోనే వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్ ని గొప్పగా చెప్పుకునే అభిమానులు మాత్రం త్రివిక్రమ్ తన స్నేహితుడు అయిన సునీల్ అపద లో ఉన్నప్పుడు ఆదుకోవడం లేదు అంటూ పలు రకాల విమర్శలు అయితే చేస్తున్నారు. ఇక రాబోయే సినిమాల్లో అయిన త్రివిక్రమ్ సునీల్ కి మంచి క్యారెక్టర్ ఇస్తాడో లేదో చూడాలి…