Site icon OkTelugu

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR

Jr NTR

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ప్రస్తుతానికి ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ‘డ్రాగన్’ చిత్రం లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది జూన్ నెలలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పూర్తి అయ్యాక, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం ‘గాడ్ ఆఫ్ వార్’ అనే మైథాలజీ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా పై కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయనున్నారు.

ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేస్తున్నారు కదా , మరి అభిమానులు ఎందుకు నిరాశ చెందుతున్నారు అనే అనుమానం మీకు రావొచ్చు. వివరాల్లోకి వెళ్తే , ఎన్టీఆర్ కెరీర్ లో ‘దేవర’ చిత్రం ఎంతో ప్రత్యేకం. #RRR తర్వాత కొరటాల శివ దర్శకత్వం లో , భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దాదాపుగా 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ ఉంటుందని , ఆ చిత్ర దర్శకుడు క్లైమాక్స్ లోనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా పలుమార్లు ‘దేవర 2’ ఆగిపోయిందంటూ వస్తున్నా వార్తలపై స్పందిస్తూ , వాటిల్లో ఎలాంటి నిజం లేదని , డ్రాగన్ పూర్తి అయ్యాక ఈ చిత్రాన్ని మొదలు పెడుతామని చెప్పుకొచ్చారు. అదే విధంగా నిర్మాత కూడా పలు సందర్భాల్లో ‘దేవర 2’ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

కానీ అలాంటిదేమి జరగడం లేదు , ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి సిద్ధం అవ్వగా, కొరటాల శివ బాలయ్య తో చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఇలా ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీ కానున్నారు. దీంతో ‘దేవర 2’ గురించి ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ప్రచారమైన వార్తలు నిజమేనని , ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దేవర కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ, కంటెంట్ విషయం లో మాత్రం సీక్వెల్ తీసేంత స్కోప్ అందులో లేదు. ఒకవేళ తీసిన క్లిక్ అవుతుందనే నమ్మకం లేదు . అందుకే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే దీనిపై మూవీ టీం రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.

Exit mobile version