Ram Charan Deepika Padukone
Ram Charan: మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో రామ్ చరణ్…ఈయన చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చేసిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక ఇప్పటివరకు ఏ హీరో కూడా తను చేసిన రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. కానీ రామ్ చరణ్(Ram Charan) మాత్రం ఆ రికార్డుని రెండో సినిమాతోనే సాధించి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు అమితాబచ్చన్ నటించిన జంజీర్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. దాన్ని తెలుగులో తుఫాన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ లోనూ, తెలుగులోనూ భారీ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా సమయంలో బాలీవుడ్ కి చెందిన దీపిక పదుకునే ని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగితే నేను నటించనని చెప్పేసిందట దాంతో ప్రియాంక చోప్రా ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.
Also read : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న కుర్చీ మడతపెట్టి సాంగ్… మహేష్ మాస్ జాతరకు ఊహించని రెస్పాన్స్
అయితే రామ్ చరణ్ కి, ప్రియాంక చోప్రా కి మధ్య కెమిస్ట్రీ అంత బాగా వర్క్ అవుట్ అవ్వలేదు అంటూ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తెలియజేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా బాలీవుడ్ లోను, టాలీవుడ్ లోను భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక అప్పటినుంచి మెగా పవర్ స్టార్ అభిమానులందరికి కూడా దీపిక పదుకునే అంటే ఇష్టం లేదు. ఎందుకంటే తమ అభిమాన హీరో అయిన మెగా పవర్ స్టార్ సినిమాలో నటించనని చెప్పినప్పుడు దీపిక పదుకునే(Deepika Padukone) ని మేము ఎందుకు ఇష్టపడాలి అనే ఉద్దేశ్యంలో మెగా అభిమానులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని జంజీర్ సినిమా తో ఇచ్చినప్పటికీ భారీ పరాజయాన్ని మూట గట్టుకున్నాడు.
Also read : నాతో పెట్టుకుంటే మీ పని మటాష్… బాడీ గార్డ్ ని పరిచయం చేసిన రేణూ దేశాయ్, వీడియో వైరల్
ఇక రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని అక్కడ తన జెండాని ఎగరేసాడు. ఇక మొత్తానికైతే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా రామ్ చరణ్ బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నప్పటికీ త్రిబుల్ ఆర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయి అక్కడ జనాలు అదిరిపోయేలా హిట్ అందుకున్నాడు…