Trivikram and Sivakarthikeyan : ‘గుంటూరు కారం’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది. ఆయన మిత్రుడు , ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి సంబంధించిన పనులను చూసుకుంటూ ఇన్ని రోజులు బిజీ గా గడిపాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. అల్లు అర్జున్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని చేయబోతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ స్క్రిప్ట్ వర్క్ పై ఇంకా పని చేయాల్సిన అవసరం ఉండడంతో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ముందుగా అట్లీ తో చేయడానికి మొగ్గు చూపాడు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఎవరితో చేయబోతున్నాడు? అనే అంశంపై సోషల్ మీడియా లో ఎన్నో ఊహాగానాలు ప్రచారం అయ్యాయి.
Also Read : త్రివిక్రమ్ ను పక్కన పెడుతున్న తెలుగు హీరోలు…కారణం ఇదేనా..?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో కలిసి త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నాడంటూ రెండు రోజుల క్రితమే ఒక వార్త వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కానీ ఆయన తమిళ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) తో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న బలమైన టాక్. రీసెంట్ గానే వీళ్లిద్దరు చెన్నై లో స్టోరీ సిట్టింగ్ కూడా వేశారట. కాంబినేషన్ ఓకే అయ్యింది కానీ, శివ కార్తికేయన్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యిందట. దాదాపుగా 70 కోట్ల రూపాయిల వరకు ఆయన రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు సమాచారం. మన టాలీవుడ్ లో అభిమానులు దైవం గా కొలిచే కొంతమంది హీరోలు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు.
అలాంటిది శివ కార్తికేయన్ ఏకంగా అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేలోపు త్రివిక్రమ్ నోటి నుండి మాటలు కూడా రాలేదట. ఇంత రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం, శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’ బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడమే. ఇప్పటి వరకు తలపతి విజయ్, సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ కి తప్ప, ఏ హీరోకి కూడా ఇంత వసూళ్లు ఇప్పటి వరకు రాలేదట. స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు కాబట్టే, ఈ స్థాయి రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మేకర్స్ అందుకు ఒప్పుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరికొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మురుగదాస్ దర్శకత్వం లో ‘మదరాసి’ అనే చిత్రం చేస్తున్నాడు.
Also Read : తెలుగులో సూర్య, విక్రమ్ ల మాదిరిగా విశాల్, శివ కార్తికేయన్ లు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు…