Photo Story: తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు సౌత్ హీరోలుగా ఎదిగిపోతున్నారు. వీరి సినిమాలన్నీ ఇతర భాషల్లో రిలీజ్ కావడంతో సౌత్ లెవల్లో ఫ్యాన్స్ పెరిగిపోయారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇప్పటి వరకు కమలాసన్, రజనీకాంత్, తదితరులు అన్ని చోట్లా స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇచ్చినవాళ్లు సైతం ఇతర పరిశ్రమల్లో తమ హవా చాటుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఓ హీరో తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూనే తెలుగులోనూ నేరుగా నటిస్తూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన ఓ చిన్నప్పటి ఫొటో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన విశేషాలేంటంటే?
ఈ ఫొటోలో కొంతమంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఓ బాలుడు, ఆయన వెనుకే మరో అమ్మాయి ఉంది. వీరిద్దరు అప్పుడు సరదాగా ఆటలాడుకున్నారు. కానీ ఇప్పుడు దంపతులయ్యారు. అంటే పెళ్లి చేసుకున్నారు. అయితే కామన్ పీపుల్ అయితే ఇంత చర్చ ఉండేది కాదు. కానీ ఆ కుర్రాడు ఓ సెలబ్రెటీగా మారాడు. ఆయన ఎవరో కాదు. శివకార్తీకేయన్. శివకార్తీకేయన్ తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతున్నాడు.
శివకార్తీకేయన్ మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా జీవితం ప్రారంభించారు. జోకులతో అందరినీ నవ్వించేవాడు. స్టార్ హీరో రజనీకాంత్ వాయిస్ ను అయితే దించేవారు. అయితే ఓ స్నేహితుడు తనకో సలహా ఇవ్వడంతో ఓ కామెడీ షో లో పాల్గొన్నాడు. ఇది సక్సెస్ అవడంతో ఫేమస్ అయ్యాడు. దీంతో కొన్ని షార్ట్ ఫిలిస్ లో నటించారు. అలా స్టార్ అయిన తరువాత ‘ఏగన్’ అనే సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. కానీ తన పాత్ర అందులో లేకపోవడంతో షాక్ తిన్నాడు.
అయితే ఆ తరువాత ‘మెరీనా’ అనే మూవీతో హీరోగా నటించారు. ఇది తెలుగులో ‘మెరీనా బీచ్’ పేరుతో తెలుగులో డబ్ అయింది. ఈ సినిమాతో శివ కార్తీకేయన్ కు గుర్తింపు రావడంతో ఆ తరువాత హీరో, హోస్ట్, డబ్బింగ్ ఆర్టిస్టు, సింగర్ ఇలా పలు విధాలుగా నటించారు. అయితే తెలుగులో ‘రెమో’ అనే డబ్ మూవీతో శివకార్తీకేయన్ ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరువాత నేరుగా ‘ప్రిన్స్’ అనే సినిమా చేయడంతో ఇక్కడా అయనకు ఫ్యాన్స్ పెరిగారు. తాజాగా శివకార్తీకేయన్ నటించిన ‘మహవీరుడు’ జూలై 14న రిలీజ్ అయింది.