Rajamouli : ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ‘త్రిబుల్ ఆర్’ సినిమా వరకు వరుసగా సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు. ఇక ఆయనతో సినిమాలను చేసిన హీరోలందరూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టైల్ ని కూడా ఇచ్చాడు. దానివల్లే ఇప్పుడున్న స్టార్ హీరోలందరు చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఒక్క ఫెయిల్యూర్ ని కూడా చూడని దర్శకుడు ఎవరైన ఉన్నారా అంటే అది రాజమౌళి అనే చెప్పాలి. తెలుగులోనే కాదు యావత్ ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పటివరకు ఒక ఫెయిల్యూర్ లేని దర్శకుడు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి ఒక ఘనతను సాధించిన రాజమౌళి పాన్ వరల్డ్ లో భారీ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఇక తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ముందుకు దూసుకెళ్లిన ఈ స్టార్ డైరెక్టర్ తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి గల కారణం ఏంటి అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమాతో మంచి సక్సెస్ ని సాధించిన ఏ దర్శకుడైన కూడా తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని కోరుకుంటాడు. దానికి కారణం ఏంటి అంటే ఆయనతో సినిమా చేస్తే దర్శకులకు ఎక్కడ లేని క్రేజ్ అయితే వస్తుందని నమ్ముతూ ఉంటారు.
కానీ రాజమౌళి మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలైతే చేయలేదు. కారణం ఏదైనా కూడా ఆయనకు చిరంజీవితో సినిమా చేయడం ఇష్టం లేదా లేదంటే చిరంజీవి గారిని హ్యాండిల్ చేసే కెపాసిటీ తన దగ్గర లేదని అతను సైలెంట్ గా వదిలేస్తున్నాడా? అంటూ కొంతమంది చిరంజీవి అభిమానులు సైతం రాజమౌళి మీద కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తో రెండు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న రాజమౌళి చిరంజీవితో సినిమా చేస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి వీళ్ళ కాంబోలో ఇప్పుడైనా సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని కొంతవరకు వార్తలు వచ్చినప్పటికి అవి కార్య రూపం దాల్చలేదు.
మరి ఇకమీదటైనా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడి డైరెక్షన్ లో నటించడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చిరంజీవితో సినిమా చేయలేకపోవచ్చు. కారణం ఏంటి అంటే ఆయనకు ఉన్న కమిట్ మెంట్స్ అనే చెప్పాలి…