https://oktelugu.com/

YS Sharmila: షర్మిలకు షాక్ ఇచ్చిన సీనియర్.. ఇక కష్టమే

ఏపీ కాంగ్రెస్ లో ఉన్నది తక్కువ మందే నాయకులు. వారిని కూడా సమన్వయం చేయలేకపోతున్నారు షర్మిల. దీంతో వారంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 11, 2024 / 10:09 AM IST

    YS Sharmila

    Follow us on

    YS Sharmila: వైయస్ షర్మిలపై అసమ్మతి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆమె నాయకత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తెలంగాణలో వైయస్సార్ పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలను ఆమెకు అప్పగించింది. అయితే గత పది నెలలుగా ఆమె సాధించినది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసిన జగన్ ను మాత్రం ఓడించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు షర్మిల. అయితే ఎన్నికల అనంతరం కూడా జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. పార్టీ బలోపేతం పై ఎటువంటి దృష్టి పెట్టలేదన్నది ఆమెపై ఉన్న విమర్శ. ఏపీలో అధికారపక్షాన్ని విడిచిపెట్టి.. అదే పనిగా వైసీపీని టార్గెట్ చేసుకుంటున్నారు షర్మిల. కేవలం కుటుంబ పరంగా నెలకొన్న వివాదాలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అదే ఇప్పుడు మైనస్ గా మారింది.

    * కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం
    ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా తెలుగుదేశం, జనసేన ఉన్నాయి. ఎన్డీఏకు జాతీయస్థాయిలో వ్యతిరేక పక్షం కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ కూటమి పార్టీల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ షర్మిలపై ఉంది. ప్రధానంగా ఆమె మాజీ సీఎం జగన్ పై విమర్శలకు పరిమితం అవుతున్నారు. ఆ స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబుపై కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం లేదు. దీనినే తప్పు పడుతున్నారు సీనియర్లు. నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు.

    *కుటుంబ వివాదాలకే ప్రాధాన్యం
    తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తెరమీదకు వచ్చారు. నేరుగా షర్మిలను టార్గెట్ చేసుకున్నారు. ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. ఎల్లప్పుడూ కుటుంబ వివాదాలకి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అన్నయ్య జగన్ పై విమర్శలు చేస్తే చాలు.. పార్టీ ఏమైపోయినా పర్వాలేదన్న రీతిలో షర్మిల వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు హర్ష కుమార్. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని.. కానీ షర్మిల లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ బలపడడం కష్టమని కూడా హర్ష కుమార్ తేల్చేశారు.