Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: అమ్మాయిల కాళ్లు ఎందుకు నాకుతున్నావంటే.. యాంకర్ కు వర్మ షాకింగ్ రిప్లై

Ram Gopal Varma: అమ్మాయిల కాళ్లు ఎందుకు నాకుతున్నావంటే.. యాంకర్ కు వర్మ షాకింగ్ రిప్లై

Ram Gopal Varma
Ram Gopal Varma

Ram Gopal Varma: సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతారు. ప్రతీ విషయాన్ని ఆయన వివాదం చేయడమే లక్ష్యంగా పోస్టులు పెడుతుంటారు. ఈమధ్య ఒకమ్మాయితో చనువుగా ఉన్న వీడియో పెట్టి హల్ చల్ చేశారు. క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ ఇలా చేయడమేంటి? అని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీపై వస్తున్న విమర్శలపై యాంకర్ ప్రశ్నించారు. మీరు అమ్మాయిల కాళ్లు నాకడంపై కొందరు రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడే ఏం సమాధానం చెబుతారు? అని యాంకర్ ప్రశ్నించారు. దీంతో ఆర్జీవి ఇచ్చిన రిప్లైకి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు.

ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ ‘సోషల్ మీడియాలో మీరు ఓ అమ్మాయి కాళ్లు నాకుతూ వీడియో పెట్టారు.. అయితే ఈ వీడియో పై ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అని అడగగా.. ఆర్జీవీ మాట్లాడుతూ ‘నా ఆన్సర్ అయితే ఎవడేం చేస్తే మీకేంటి? అన్నట్లుగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆన్సర్ ను నేను 20 సంవత్సరాలుగా చెబుతున్నా.. సమాజంలో ఎన్నో మంచి విషయాలుండగా.. ఇలాంటి విషయాలను బూతద్దం పెట్టి ఎందుకు ప్రజలకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదు.’ అని అన్నారు.

ఇక యాంకర్ మరో ప్రశ్న వేస్తూ.. ‘ఆర్జీవీ అలా చేయాలనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చుగా.. ఇలా పబ్లిక్ కు వీడియోలు వదలడం దేనికి?’ అని అడిగితే ఏం చెబుతారు? అడగగా.. ‘నేను ఎలాంటి వీడియోలు పెట్టినా నా పర్సనల్ ట్విట్టర్ ఖాతాలో పెడుతాను. అలాగే నా ట్విట్టర్ ఖాతాకు లైక్ కొట్టిన వాళ్లకే నేను పెట్టిన పోస్టులు కనిపిస్తాయి. మీరు ఇలాంటి పోస్టులు చూడొద్దనుకున్ప్పుడు అన్ లైక్ చేయండి.. లేదా నేను పెట్టిన పోస్టులు చూడకుండా ఇగ్నోర్ చేయండి… కానీ నాకంటే ఎక్కువ మీరు రచ్చ చేస్తున్నారు గదా.. అని ఆర్జీవీ రిప్లై ఇచ్చారు.

Ram Gopal Varma
Ram Gopal Varma

అలాగే ఆర్జీవి అక్కడున్న యాంకర్ తో మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్స్ నాకు నచ్చలేదు. వద్దంటే మాత్రం ఊరుకుంటారా? అని యాంకర్ తో అనడంతో ‘తిప్పి తిప్పి నాకే వేశారా’ అంటూ స్మెల్ ఇచ్చింది. అలాగే మీకు ఏ కలర్ అంటే ఇష్టం అని ఆర్జీవీని అడగగా.. నాకు బ్లాక్ అంటే ఇష్టం అని చెబుతారు. అంటే ఎవరికీ నచ్చని బ్లాక్ అంటే మీకు నచ్చుతుందా? అని యాంకర్ రిప్లై ఇస్తారు. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular