Homeలైఫ్ స్టైల్Heart Disease: వారానికి ఎంతసేపు నడిస్తే గుండెపోటును దూరం చేసుకోవచ్చు?

Heart Disease: వారానికి ఎంతసేపు నడిస్తే గుండెపోటును దూరం చేసుకోవచ్చు?

Heart Disease
Heart Disease

Heart Disease: ఆధునిక కాలంలో వ్యాధుల బారిన పడుతున్నాం. మనం తీసుకునే ఆహారాలే మనకు తిప్పలు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటోంది. ప్రతి రోజు నడక చాలా అవసరం. నడకపై అందరికి అవగాహన ఏర్పడుతోంది. వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. రోజుకు కొంత సేపైనా వాకింగ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది. లేకపోతే కష్టాలే. శరీరం రోగాలకు నిలయంగా మారుతోంది. రోజు కనీసం 45 నిమిషాల పాటు నడిస్తే ఎంతో లాభం కలుగుతుంది.

రోజు 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా నడిస్తే గుండె జబ్బు, పక్షవాతంతో పాటు క్యాన్సర్ వంటి రోగాలు నియంత్రణలో ఉంటాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో రుజువైంది. దీంతో వాకింగ్ కు అత్యంత ఆదరణ కలుగుతోంది. ప్రతి ఒక్కరు రోజుకు ఓ గంట పాటైనా నడవాలని తాపత్రయపడుతున్నారు. దీంతో పది అకాల మరణాల్లో ఒక దాన్నయినా నివారించవచ్చు. వాకింగ్ తో ఎన్నో రకాల వ్యాధులు దూరమయ్యే ఆస్కారం ఉంటుంది.

Also Read: Rahul Sipligunj: ఒక బార్బర్.. ఆస్కార్ రేంజ్ కు ఎలా ఎదిగాడు.. రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ జర్నీ

శారీరక అలసట లేకపోవడం వల్ల వ్యాధుల ముప్పు ఏర్పడుతోంది. వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 17 శాతం, క్యాన్సర్ ముప్పు 7 శాతం తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయట పడాలంటే రోజు వాకింగ్ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుది. వాకింగ్ చేయడం వల్ల మన శారీరక వ్యవస్థకు మేలు కలుగుతుంది. రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అందుకే అందరు విధిగా వాకింగ్ చేయడం ఉత్తమం.

వాకింగ్ చేయడం వల్ల దాదాపు 25 రకాల రోగాలు రాకుండా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి వాకింగ్ పై అవగాహన ఏర్పడుతోంది. అందుకే నడిచేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వారానికి కనీసం 75 నిమిషాల పాటైనా నడవడం వల్ల గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు. దీనిపై అందరు జాగ్రత్తలు తీసుకుని గుండె జబ్బు రాకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. స్ర్టోక్ వస్తే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అందుకే ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: Chanakya Neeti: చాణక్య నీతి ఈ గుణాలుంటేనే భార్య.. అందుకు ఏం చేయాలంటే?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular