
Rohit Sharma- Ravindra Jadeja: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పై నోరు పారేసుకున్నాడు. బుధవారం తొలి రోజు ఆటలో రవీంద్ర జడేజా వరుసగా రివ్యూలు వృధా చేశాడనే కోపంతో రోహిత్ శర్మ ఆగ్రహంతో ఊగిపోయాడు.. ఓవైపు నవ్వుతూనే రవీంద్ర జడేజా కు చురకలు అంటించాడు.. బుధవారం టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది.. అయితే రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను చావు దెబ్బ తీశాడు.
అయితే రవీంద్ర జడజ రెండు రివ్యూలు వృధా చేశాడు. ఓపెనర్ ఖవాజా(60) చెలరేగి ఆడటంతో భారత్ మీద ఆసీస్ ఆధిక్యం సంపాదించింది. ఇక ఖవాజా వికెట్ కోసం జడేజా జడేజా రెండు రివ్యూలు వృథా చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తో రివ్యూ తీసుకునేలా చేశాడు.
ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ సందర్భంగా జడేజా వేసిన ఆరో ఓవర్లో ఖవాజా వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఎల్బీ డబ్ల్యూ కోసం టీం ఇండియా అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే బంతి లైన్ లో పడి వికెట్ల పైకి వెళ్తోందని రోహిత్ కు చెప్పిన జడేజా రివ్యూ కోరాలని పట్టుబట్టాడు.. దీంతో రోహిత్ శర్మ డీఆర్ఎస్ కోరాడు.

అయితే రిప్లై లో బంతి అవుట్ సైడ్ లెగ్ స్టంప్ పై పడినట్టు కనిపించింది. దీంతో రివ్యూ వృధా అయ్యింది. తర్వాత 10 ఓవర్లో మరోసారి జడేజా బౌలింగ్లో ఖవాజా వికెట్ల ముందు దొరికి పోయాడు. మళ్ళీ జడేజా రిక్వెస్ట్ చేయడంతో రోహిత్ శర్మ రివ్యూ కోరాడు. కానీ ఈసారి బంతి లెగ్ స్టంప్ న కు దూరంగా వెళుతున్నట్టు రిప్లై లో కనిపించింది.. దీంతో రెండోసారి కూడా రివ్యూ వృధా అయ్యింది.. వరుసగా రెండు రివ్యూలు వృధా చేయడంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్ శర్మ..బంతి ఎక్కడ పిచ్ అవుతుందో చూడాలని మండిపడ్డాడు. రాయలేని పదాలు ఉపయోగించి జడేజాను తిట్టాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.