Rao Gopal Rao: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో విలనిజం సరికొత్త నిర్వచనం తెలిపిన మహా నటుడు రావు గోపాల రావు గారు..విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక్క ప్రత్యేకమైన మ్యానరిజం తో అశేష ప్రజాభిమానం సంపాదించాడు ఆయన..రంగస్థల నటుడిగా ప్రసిద్ధి చెందిన రావు గోపాల రావు కి ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించే అవకాశాలు మాత్రమే దక్కింది..ఆ సమయం లో క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన ‘శారద’ అనే సినిమాలో రావు గోపాల రావు గారి పాత్రకి అద్భుతమైన గుర్తింపు లభించింది..ఇక ఈ సినిమా తర్వాత ఆయనకీ లెజెండరీ డైరెక్టర్, స్వర్గీయ శ్రీ బాపు గారి దర్శకత్వ సారథ్యం లో తెరకెక్కిన ‘ముత్యాల ముగ్గు’ అనే సినిమా అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ద్వారా రావు గోపాల రావు గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..అప్పట్లో ప్రతి హీరో సినిమాలో రావు గోపాల రావు గారే విలన్ గా నటించేవాడు..అంతతి డిమాండ్ ని సంపాదించుకున్న రావు గోపాల రావు గారు..చివరి రోజుల్లో ఆయన పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు.

ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో సినిమాల్లో రావు గోపాల రావు గారి డిమాండ్ మాములుగా ఉండేది కాదు..ఆయన అడిగినంత డబ్బులు ఇచ్చి నిర్మాతలు ఆయనని తమ సినిమాలలో పెట్టుకునే వారు..అలా రావు గోపాల రావు గారు వచ్చిన డబ్బులతో ఆస్తులను బాగానే కూడగట్టుకున్నారు..కానీ వాటిని నిలుపుకోవడం లో మాత్రం ఆయన విఫలం అయ్యాడు..ఆయన పక్కన ఉండేవారు నమ్మించి మోసం చేసారు..ఆయన ఆస్తులను మొత్తం కాజేశారు..వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం క్షీణించడం తో ఆసుపత్రి పాలైయ్యారు..కనీసం చికిత్స చేయించుకోడానికి కూడా డబ్బులు లేవు..ఆ సమయం లో తాను దాచుకున్న కొంత డబ్బుని కూడా బయటకి తీసి చికిత్స చేయించుకున్నారు.

కానీ ఫలితం లేకుండా పోయింది..అలా నటుడిగా శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన ఈ మహానటుడు చివరి రోజుల్లో ఇలా చనిపోయాడు అని వింటుంటే మనసుకి చాలా బాధ కలుగుతుంది కదూ !..విచిత్రం ఏమిటి అంటే ఈ మహానటుడు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం ని చూడడానికి ఒక్క స్టార్ హీరో కానీ..ఒక్క నిర్మాత కానీ రాలేదు..అల్లు రామలింగయ్య, PL నారాయణ, రేలంగి మరియు నిర్మాత జై కృష్ణ వంటి ఇండస్ట్రీ పెద్దలు మినహా ఒక్కరు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాకపోవడం నిజంగా ఎంతో అవమానకరం అని చెప్పొచ్చు..అయితే అప్పట్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కి తరలి వెళ్ళిపోయింది..రావు గోపాల రావు గారి అంత్యక్రియలు చెన్నై లో జరిగాయి..అందుకే ఆయన అంత్యక్రియలకు ఎవ్వరు రాలేకపోయారు అని అంటుంటారు..ఏది ఏమైనా ఒక్క లెజెండ్ కి దక్కాల్సిన గౌరవం ఇది కాదని ఆయన మిత్రులు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రావు గోపాల రావు గారిని తల్చుకుంటూ బాధపడ్డారు..ఇది ఇలా ఉండగా రావు గోపాల రావు గారి కుమారుడు రావు రమేష్ ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ మోస్ట్ క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.
Also Read:Chiru Godfather Hindi Digital Rights: హిందీ లో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయిన గాడ్ ఫాదర్ సినిమా హక్కులు
Recommended Videos
[…] Also Read: Rao Gopal Rao: రావు గోపాల రావు గారు చనిపోయినప్… […]