Allu Arjun Rejected Movies: అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. ఆయన చిత్రాల తీరు చూస్తే మనకు ఎన్నో విజయవంతమైన చిత్రాలే కనిపిస్తాయి. కానీ ఆయన ఇంకా ఎన్నో సినిమాలు వదులుకుని ఇతరులకు బ్లాక్ బస్టర్లు రావడానికి కారణమయ్యారని తెలుస్తోంది. గంగోత్రి సినిమా ద్వారా తెలుగులో తెరంగేట్రం చేసిన అర్జున్ ఆ సినిమా విడుదలకు ముందే జయం సినిమా చాన్స్ వచ్చినా పట్టించుకోలేదు. దీంతో నితిన్ కు ఆ సినిమా ఎంతటి విజయం సాధించిపెట్టిందో తెలిసిందే. జయం సినిమాతో నితిన్ ఎంతో ఎత్తుకు ఎదిగిన విషయం విధితమే. అలా తనకు వచ్చిన అవకాశాన్ని కాదనుకుని ఎన్నో సినిమాలు దూరం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమా కూడా మొదట అల్లు అర్జున్ తలుపు తట్టినా ఆయన నిరాకరించడంతో రవితేజ ఉపయోగించుకుని విజయం అందుకున్నాడు. 100 పర్సెంట్ లవ్ కూడా అల్లు అర్జున్ తో చేయాలని దర్శకుడు సుకుమార్ నిర్ణయించినా అది కుదరకపోవడంతో ఆ సినిమా నాగచైతన్యను వరించింది. ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ వదులుకున్న సినిమాలతో చాలా మందికి విజయాలు దక్కడం తెలిసిందే.
Also Read: Rao Gopal Rao: రావు గోపాల రావు గారు చనిపోయినప్పుడు ఒక్క హీరో కూడా రాలేదు.. ఎందుకో తెలుసా?
సాయిధరమ్ తేజ హీరోగా వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ ఎంతటి హిట్ సాధించిందో మనకు సుపరిచితమే. ఈ సినిమా కూడా దర్శకుడు హరీష్ శంకర్ బన్నీ కోసమే కథ రాసుకున్నాడు. కానీ కాల్షీట్లు దొరకక ఆ సినిమా సాయిధరమ్ తేజకు దక్కింది. దీంతో అతడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించి తన మనుగడకు రాచబాట వేసుకున్నాడు. తరువాత దువ్వాడ జగన్నాథమ్ చేసినా అది విజయం సాధించలేదు. అలా అల్లు అర్జున్ వదులుకున్న సినిమాలతోనే ఎందరో హిట్లు సాధించడం విశేషం.

ఇంకా అరవింద సమేత, గీతగోవిందం, అర్జున్ రెడ్డి, పండగ చేస్కో, కృష్ణాష్టమి, ఒక లైలా కోసం, నాని గ్యాంగ్ లీడర్, డిస్కో రాజా, జాను వంటి సినిమాలను కూడా బన్నీ కాదనుకున్నాడు. దీంతో ఆ సినిమాలు వారికి ఎంతో పేరును తెచ్చిపెట్టాయి. సినిమా పరిశ్రమలో సినిమాలు ఒకరి కోసం రాసుకున్న కథలు మరొకరికి సూపర్ హిట్లు కావడం తెలిసిందే. ఈ కోణంలోనే అల్లు అర్జున్ వదులుకున్న సినిమాలు ఇతరులకు మంచి హిట్లు ఇవ్వడం చూస్తున్నాం.