Vikram Movie Santhanam Character: ఇటీవల కాలం లో సౌత్ ఇండియా లో అన్ని ప్రాంతీయ బాషలలో సంచలన విజయం సాధించిన చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది..ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 370 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం..400 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అతి త్వరలోనే చేరబోతోంది..దశావతారం సినిమా తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కమల్ హాసన్ కి ఈ సినిమా సక్సెస్ మాములు కిక్ ఇవ్వలేదు అనే చెప్పాలి.

ఈ సినిమా ఆయనకీ కేవలం హీరో గా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా కాసుల వర్షం కురిపించిందనే చెప్పాలి..ఉత్తమ విలన్ , విశ్వరూపం 2 వంటి సినిమాలను నిర్మించి అప్పుల ఊబిలో చిక్కుకున్న కమల్ హాసన్ కి విక్రమ్ సినిమా చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది..ఇక ఈ సినిమా ఇటీవలే తమిళం లో బాహుబలి 2 కలెక్షన్స్ ని దాటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
Also Read: Rakul Preet Singh: రకుల్ కి కోట్ల రూపాయిలు విలువ చేసే ఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రముఖ స్టార్ హీరో

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో కమల్ హాసన్ నటనకి ఎంత మంచి పేరు వచ్చిందో..సంతానం గా నటించిన విజయ్ సేతుపతికి కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది..ఒక పక్క టాప్ లీడింగ్ తమిళ హీరోలలో ఒకడిగా కొనసాగుతూనే మరోపక్క విభిన్నమైన పాత్రలతో అలరిస్తూ ముందుకి దూసుకుపోతున్న విజయ్ సేతుపతి కి సంతానం క్యారెక్టర్ ఆయన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది అని చెప్పొచ్చు..అయితే ఈ పాత్రని చాలా మంది స్టార్స్ మిస్ చేసుకున్నారనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి..ఈ పాత్రకోసం డైరెక్టర్ లోకేష్ ముందుగా ప్రభుదేవా మరియు రాఘవ లారెన్స్ వంటి వారిని అడిగారని..కానీ వాళ్ళ డేట్స్ ఖాళి లేకపోవడం తో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదనే టాక్ వినిపిస్తుంది..అంతే కాకుండా ఈ పాత్ర కోసం మన టాలీవుడ్ నుండి న్యాచురల్ స్టార్ నాని కూడా అడిగారట..కానీ ఆయన కూడా నో చెప్పినట్టు తెలుస్తుంది..అలా సౌత్ ఇండియన్ సినీ చరిత్ర లో చిరస్థాయిగా గుర్తుండిపోయ్యే సాంతం క్యారక్టర్ ని ఈ క్రేజ్ స్టార్స్ మిస్ చేసుకున్నారు.
Also Read:Actor Suriya Daughter Diya: చిన్న వయస్సులోనే ప్రభంజనం సృష్టించిన హీరో సూర్య కూతురు
[…] Also Read: Vikram Movie Santhanam Character: విక్రమ్ సినిమాలో సంతానం … […]