https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 లో కమలహాసన్ సిద్ధార్థ్ ఇద్దరిలో హీరో ఎవరు..?

Bharateeyudu 2: మొన్నటిదాకా కమలహాసన్ లుక్కు పైన చాలా విమర్శలైతే వచ్చాయి. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ముసలి గెటప్ లో ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 3, 2024 / 12:36 PM IST

    Who is the hero of Kamala Haasan and Siddharth in Bharateeyudu 2

    Follow us on

    Bharateeyudu 2: లోకనాయకుడు కమలహాసన్(Kamal Haasan) ప్రస్తుతం భారతీయుడు 2 అనే సినిమా చేస్తున్నాడు అయితే శంకర్(Shankar) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా సినిమా మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా సినిమా స్టోరీ విషయంలో చాలా లీకులైతే అందుతున్నాయి.

    చాలామంది ఈ సినిమా స్టోరీ మీద కామెంట్లైతే చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమలహాసన్ కనిపించేది చాలా తక్కువ సమయమే అని చాలామంది చెబుతున్నారు. మొన్నటిదాకా కమలహాసన్ లుక్కు పైన చాలా విమర్శలైతే వచ్చాయి. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ముసలి గెటప్ లో ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏజ్ గ్యాప్ అనేది చూపించట్లేదు అని చాలామంది ఈ సినిమా మీద చాలా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు అవన్నీ ముగిసాయి కానీ ఈ సినిమా స్టోరీ మీదనే కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి.

    Also Read: Actor: ఎయిర్పోర్ట్ లో బుల్లెట్స్ తో దొరికిపోయిన నటుడు… అధికారులు షాక్!

    ఇక కమలహాసన్ మాత్రం ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక శంకర్ కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ కథ విషయంలోనే చాలా ఆందోళనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్(Siddharth) కి ఎక్కువ ప్రియార్టీ ఉంటుందట. మరి కమలహాసన్ పరిస్థితి ఏంటి.? ఒకవేళ ఆయన తక్కువ సమయం కనిపిస్తే ఆయన అభిమానులు ఎలా రియక్ట్ అవుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

    Also Read: Nagarjuna-Dhanush: నాగార్జున ధనుష్ లను కలుపుతున్న శేఖర్ కమ్ముల…మ్యాటరెంటంటే..?

    ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరో రోల్ పోషిస్తున్నారట. ఇక కమలహాసన్ హీరో కాదని ఆయన పాత్ర సపరేట్ గా ఉండబోతుందనే లీకులు కూడా అభిమానుల్లో కలవరాన్ని రేపుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా రిలీజ్ అయితే తప్ప అభిమానుల్లో ఉన్న డౌట్లకి క్లారిటీ అయితే దొరకదు…