https://oktelugu.com/

Nagarjuna-Dhanush: నాగార్జున ధనుష్ లను కలుపుతున్న శేఖర్ కమ్ముల…మ్యాటరెంటంటే..?

Nagarjuna-Dhanush: అందుకే శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో తనదైన రీతిలో అద్భుతాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ధనుష్ ని హీరోగా పెట్టి 'కుబేర '(Kubera) అనే సినిమా చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 3, 2024 / 10:41 AM IST

    Dhanush and Nagarjuna Kubera Movie Latest Updates

    Follow us on

    Nagarjuna-Dhanush: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈయనకి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక తన ఇష్టాలనే సినిమాలుగా మార్చి ప్రేక్షకులను మెప్పించడంలో తను చాలా వరకు ముందు వరుసలో ఉంటాడు. అందుకే శేఖర్ కమ్ముల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ సినిమా మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు.

    అందుకే శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో తనదైన రీతిలో అద్భుతాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ధనుష్ ని హీరోగా పెట్టి ‘కుబేర ‘(Kubera) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్లిద్దరి మధ్య వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్రస్తుతం శేఖర్ కమ్ములతో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ ను కూడా వేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    Also Read: Rajamouli-Mahesh Babu: రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయం లో ఏం జరుగుతుంది…

    ఇక ఈ షెడ్యూల్ లో వీళ్ళ మధ్య జరిగే కొన్ని కీలక సన్నివేశాలతో సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో శేఖర్ కమ్ముల, నాగార్జున లకి సమానమైన ప్రాధాన్యతను ఇస్తూ ఈ సినిమాని బ్యాలెన్స్డ్ గా ముందుకు నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ఇద్దరిలో ఏ ఒక్క హీరో ఇమేజ్ అనేది తగ్గిన కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ స్క్రిప్ట్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

    Also Read: Legendary Heroes: ఇద్దరు లెజెండరీ హీరోలతో ఫొటో దిగిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?

    ఇక నాగార్జున ప్రస్తుతం వరుసగా ఫ్లాప్ సినిమాలను చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో సక్సెస్ కొట్టి హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూడా ఒక సూపర్ సక్సెస్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది…