https://oktelugu.com/

Balakrishna : బాలయ్యకు ఆ వ్యసనం ఉంది… సొంత అల్లుడు బయటపెట్టిన చేదు నిజం!

యూఎస్ వెళ్లిన ఆయనతో ఆ బ్యాగ్ ఉండాల్సిందే... అని భరత్ అన్నారు. బాలయ్యకు మందు తాగే వ్యసనం ఉందని భరత్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 12:31 PM IST

    balakrishna-and-his-sons-in-law

    Follow us on

    Balakrishna : బాలకృష్ణ తరచుగా వివాదాల్లో ఉంటారు. ఆయన పలుమార్లు అభిమానులను కొట్టారు. ప్రేమగా దగ్గరకు వచ్చిన ఫ్యాన్స్ మీద చేయి చేసుకోవడం విమర్శల పాలైంది. రాజకీయంగా సక్సెస్ కాలేదని చిరంజీవి, అమితాబ్ వంటి నటులను కించపరుస్తూ బాలయ్య గతంలో చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అలాగే గత ఏడాది ఓ వేడుకలో అక్కినేని తొక్కినేని అనడంతో అక్కినేని కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు కౌంటర్ వేశాడు. అక్కినేని అభిమానులు పలు ఏరియాల్లో నిరసనలు చేపట్టారు.

    తాజాగా హీరోయిన్ అంజలిని వేదిక మీద తోసేయడం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా హాజరైన బాలకృష్ణ వేదికపై ఫోటోకి ఫోజిస్తున్న అంజలిని గట్టిగా నెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. జాతీయ ఛానళ్లలో కథనాలు వెలువడ్డాయి. అలాగే ఆ వేడుకలో బాలకృష్ణ మద్యం సేవించాడనే ఆరోపణలు వెలువడ్డాయి. బాలయ్య పక్కన వాటర్ బాటిల్ తో పాటు మందు బాటిల్ ఉందంటూ కొన్ని వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.

    అసలు బాలయ్య పక్కన ఎలాంటి బాటిల్స్ లేవు. అవి సీజీలో చేసి దుష్ప్రచారం చేస్తున్నారని నిర్మాత నాగ వంశీ కొట్టిపారేశారు. ఒక పబ్లిక్ వేడుకలో బాలయ్య మద్యం సేవించాడా లేదా? అనే విషయం పక్కన పెడితే… ఆయనకు తాగే అలవాటు ఉందనేది సుస్పష్టం. ఓ సందర్భంలో బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఓ ఫుడ్ వ్లాగర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ భరత్ మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని వెల్లడించాడు.

    మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని తెలిశాక ఆ కంపెనీ స్టాక్ వాల్యూ పెరిగిందని అన్నారు. బాలకృష్ణ గారు వేడి నీటితో మందు తాగుతారట నిజమేనా? అని యూట్యూబర్ అడిగాడు. అవును అన్న భరత్.. ఆయన ఎప్పుడూ ఒక మందు బాటిల్, హాట్ వాటర్ క్యారీ చేస్తాడు. యూఎస్ వెళ్లిన ఆయనతో ఆ బ్యాగ్ ఉండాల్సిందే… అని భరత్ అన్నారు. బాలయ్యకు మందు తాగే వ్యసనం ఉందని భరత్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.