Vijay Devarakonda: ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి సినిమా మీద రోజు రోజుకు ఒక సరికొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ ని బట్టి చూస్తే ఈ సినిమా మీద అంచనాలైతే తారాస్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ప్రభాస్ భైరవ పాత్రను పోషిస్తుండగా, విజయ్ కల్కి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.గత కొన్ని రోజుల నుంచి విజయ్ కల్కి సినిమాలో నటిస్తున్నాడు అంటూ వచ్చిన వార్తల మీద సినిమా యూనిట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ సినిమాలో విజయ్ కచ్చితంగా నటిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరితంగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కల్కి గా విజయ్ కనిపించబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ అయితే కల్కి కాదు. మరి కల్కిగా నటించే నటుడు ఎవరు అంటూ అప్పుడే ఒక క్వశ్చన్ అయితే అందరిలో రేజైంది.
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మికి మోహన్ బాబు చేసిన అన్యాయం ఏమిటీ… ఇన్నాళ్లు ఎందుకు దాచింది?
ఇక ఇప్పుడు దానికి సమాధానం దొరికిందని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ కి నాగ్ అశ్విన్ కి మొదటి నుంచి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే నాగ్ అశ్విన్ చేసిన మొదటి సినిమా అయిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లో విజయ్ దేవరకొండ మొదటిసారిగా ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక ఆ తర్వాత ‘మహానటి ‘ సినిమాలో కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడం మనం చూశాం.
Also Read: Actress: ఈ చిన్నారి.. ఇప్పుడు ట్రెండీ బ్యూటీ.. ఎవరో చెప్పుకోండి..
ఇక వాళ్లకున్న అనుబంధంతోనే ఈ సినిమాలో కూడా కల్కి పాత్రలో నటిస్తున్నాడని ఇప్పుడు చాలా క్లియర్ కట్ గా తెలిసిపోయింది. అయితే సినిమా యూనిట్ విజయ్ పాత్ర గురించి ఎందుకు రివిల్ చేయడం లేదు అంటే సినిమా చూసే ప్రేక్షకుడి ని థ్రిల్ కి గురి చేయడానికే దీన్ని దాచి ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఇద్దరు కూడా 27వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…