Manchu Lakshmi: మంచు లక్ష్మికి మోహన్ బాబు చేసిన అన్యాయం ఏమిటీ… ఇన్నాళ్లు ఎందుకు దాచింది?

Manchu Lakshmi: సిద్ధార్థ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ జానపద కథా చిత్రం డిజాస్టర్ అయ్యింది. మంచు లక్ష్మి హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు చేసింది. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేసింది.

Written By: S Reddy, Updated On : June 21, 2024 11:44 am

Manchu Lakshmi says dad Mohan Babu roadblocked her career

Follow us on

Manchu Lakshmi: మంచు లక్ష్మి టాలీవుడ్ స్టార్ కిడ్. విలక్షణ నటుడు మోహన్ బాబు ఒక్కగానొక్క కూతురు. మంచు లక్ష్మి కెరీర్ అమెరికాలో మొదలైంది. ఆమె అక్కడ కొన్ని టెలివిజన్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరించింది. అలాగే రెండు మూడు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం టాలీవుడ్ లో అడుగు పెట్టింది. వస్తూనే ఓ నెగిటివ్ రోల్ చేసింది. కే రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ తెరకెక్కించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ చేసింది.

సిద్ధార్థ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ జానపద కథా చిత్రం డిజాస్టర్ అయ్యింది. మంచు లక్ష్మి హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు చేసింది. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేసింది. అయితే ఒక్క చిత్రం కూడా బ్రేక్ ఇవ్వలేదు. పలు చిత్రాలకు మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు . ఇటీవల మంచు లక్ష్మి ముంబైకి మకాం మార్చారు. ముంబైలో ఓ లగ్జరీ హౌస్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

Also Read: Mithila Palkar: ఆ కైపెక్కించే చూపులకు చిత్తైపోతున్న కుర్రాళ్ళు… యంగ్ బ్యూటీ మిథిల పాల్కర్ మతిపోగొట్టే ఫోజులు!

తాజా ఇంటర్వ్యూలో ఆమె తండ్రి మోహన్ బాబు మీద కీలక ఆరోపణలు చేసింది. తనకు ఆయన నుండి ప్రోత్సాహం లభించలేదని పరోక్షంగా చెప్పింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ… నేను ముంబైకి వచ్చిన కొత్తలో నా ఫ్రెండ్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. ఆమె నన్ను ముంబై వచ్చేయ్. ఇక్కడ కెరీర్ చూసుకో అనేది. రానా కూడా ఇదే తరహా సలహా ఇచ్చాడు. ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండిపోతావా… అంటుండేవాడు.

Also Read: Kalki Movie: కల్కి సినిమా నుంచి మరో భారీ అప్డేట్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్…

సౌత్ ఇండియాలో హీరోల కూతుళ్లు, చెల్లెళ్లు, అక్కలకు ఆఫర్స్ ఇవ్వరు. నటిగా ప్రోత్సహించరు. మా నాన్న మోహన్ బాబుకు కూడా నేను నటి కావడం ఇష్టం లేదు. నా తమ్ముళ్లకు ఈజీగా లభించినది నేను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. నేను పితృస్వామ్య వ్యవస్థ బాధితురాలిని. దేశం మొత్తం ఇదే ధోరణి ఉంది… అన్నారు. బాలీవుడ్ లో హీరోల కూతుళ్లు, సిస్టర్స్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. సౌత్ లో ఈ వాతావరణం లేదని ఆమె వాపోయారు. ముంబైలో కాపురం పెట్టిన మంచు లక్ష్మి ఏం సాధిస్తారో చూడాలి…