Homeక్రీడలుBangladesh Vs Australia: ఆస్ట్రేలియా ముందు బంగ్లా పప్పులుడకలేదు

Bangladesh Vs Australia: ఆస్ట్రేలియా ముందు బంగ్లా పప్పులుడకలేదు

Bangladesh Vs Australia: టీ20 ప్రపంచకప్‌–2024 మ్యాచ్‌లు కీలక దశకు చేరాయి. సూపర్‌ 8కు చేరిన జట్లు ఇప్పుడు సెమీఫైనల్‌ బెర్తు కోసం తలపడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పప్పులు ఉడకలేదు. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

వర్షంతో ఆటకం..
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మైదానం తడిగా ఉండడంతో మ్యాచ్‌ టాస్‌ ఆలస్యమైంది. తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది.

తడబడిన బంగ్లా బ్యాటింగ్‌..
మ్యాచ్‌ను గెలిచి సత్తా చాటాలనుకున్న బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో తడబడింది. మిచెల్‌ స్టార్క్‌ టాంజిద్‌ హసన్‌ను డకౌట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. లిట్టన్‌ దాస్, కెప్టెన్‌ నజ్ముల్‌ హొస్సేన్‌ శాంటో భాగస్వామ్యాన్ని నిర్మించడం ప్రారంభించారు, ఆడమ్‌ జంపా ఆస్ట్రేలియాను రక్షించడానికి వచ్చారు. స్పిన్నర్‌ లిట్టన్‌(16)ని పెవిలియన్‌కు పంపించాడు. వెంటనే మాక్స్‌వెల్‌ రిషద్‌ హొస్సేన్‌(2) వికెట్‌ తీశాడు.

హ్యాట్రిక్‌తో దెబ్బకొట్టిన కమిన్స్‌..
ఇక టీ20 వరల్డ్‌ కప్‌లో ఈ మ్యాచ్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది. 20వ ఓవర్‌లో ప్యాట్‌ కమిన్స్‌ వరుసగా తౌహిద్‌ హృదయ్‌(40), మహ్మదులా(2), మహేదీ హసన్‌(0) వికెట్లు తీశాడు. దీంతో 20 ఓవర్లలో బంగ్లాదేశ్‌ 8 వికెట్లు కోల్పోయి 140 పరులుగు చేసింది.

ఆస్ట్రేలియా దూకుడు..
ఇక 141 పరులు లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా దూకుడు ప్రదర్శించింది. ఏడు ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. తర్వాత వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. తర్వాత కాసేపటికి మ్యాచ్‌ ప్రారంభమైంది. దీంతో 12 ఓవర్లలో రెండు వికెట్లు కల్పోయి 93 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 53 పరుగులతో నాట్‌ఔట్‌గా నిలిచారు. ఈ క్రమంలో మరోమారు వర్షం ఆటకు అంతరాయం కల్పించింది. దీంతో మ్యాచ్‌ గెలవాలన్న బంగా ఆశలపై నీళ్లు చల్లింది.

డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో..
వర్షం తగ్గకపోవడంతో ఎంపైర్లు డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో విజేతగా ఆస్ట్రేలియాను ప్రకటించారు. బంగ్లాదేశ్ 15 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 98 పరుగులు చేయగా, పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా 7 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు, 12 ఓవర్లలో 93 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version