Site icon OkTelugu

Mahesh Babu Daughter Sitara Health Story: చిన్నతనంలో సీరియస్ గా ఉన్న మహేష్ బాబు కూతురు సితార…ఆ స్టార్ హీరో వల్లే బతికిందా..?

Mahesh Babu Emotional Post

Mahesh Babu Emotional Post

Mahesh Babu Daughter Sitara Health Story: సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో తీసిన సినిమాలు అతన్ని టాప్ హీరోగా నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళితో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సాధించేలా ఆయన ప్రణాళికలైతే రూపొందిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక మహేష్ బాబు నమ్రత లకు గౌతమ్ కృష్ణ అనే కొడుకుతో పాటు సితార అనే అమ్మాయి కూడా ఉందనే విషయం మనకు తెలిసిందే. సితార పుట్టినప్పుడు ఆమె బొడ్డు పేగునైతే దాచారట. దాంతో ఆ తర్వాత ఒక సంవత్సరానికి ఆమెకు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే ఆ బొడ్డు పేగులోని స్టెమ్ సిల్స్ తీసి దాని ద్వారా ఆమెను బాగు చేసినట్టుగా గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి…

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

మహేష్ బాబుకి తన కూతురు యొక్క బొడ్డు పేగును దాచితే మంచిదని చెప్పింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అంటూ పలు సందర్భాల్లో కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో తన కొడుకు విషయంలో మహేష్ బాబు బొడ్డు పేగును సేవ్ అయితే చేయలేదట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చిరంజీవి దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన అది తప్పకుండా సేవ్ చేయాలని చెప్పారట.

దాంతో మహేష్ తన కూతురు బొడ్డు పేగు ను సేవ్ చేయడంతో ఆమె అనారోగ్యం బారీన పడినప్పుడు ఆరోగ్యంగా తయారవడానికి అయితే అది హెల్ప్ అవుతుంది… మొత్తానికైతే చిరంజీవి చెప్పినట్టుగానే మహేష్ బాబు చేసి చాలావరకు తన స్టైల్ ని మార్చుకొని మరి ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబుకి వాళ్ళ నాన్నగారి తర్వాత చిరంజీవి అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భంలో కూడా తెలియజేశాడు…

మొత్తానికైతే ప్రస్తుతం ఇటు ఫ్యామిలీ లైఫ్ ని అటు సినిమా లైఫ్ ను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక వారణాసి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు…

Exit mobile version