Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ 2011లో వివాహం చేసుకున్నారు. బంధువుల అమ్మాయి లక్ష్మి ప్రణతితో ఏడడుగులు వేశారు. ఎన్టీఆర్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. పెద్దబ్బాయి పేరు అభయ్ రామ్ కాగా, చిన్నబ్బాయి పేరు భార్గవ్ రామ్. టాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీగా అందరూ కొనియాడుతారు. అయితే పెళ్ళికి ముందు ఎన్టీఆర్ ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ఈ మేరకు కీలక కామెంట్స్ చేశారు.
ఇంటర్ చదివే రోజుల్లో అమ్మాయిలను ఇష్టపడటాలు, అట్రాక్షన్స్ ఉన్నాయా? అని యాంకర్ అడిగాడు. ఎందుకు ఉండవు. ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఏజ్ అలాంటిది. పాసింగ్ క్లౌడ్స్ లా వెళ్లిపోతాయి అని ఎన్టీఆర్ అన్నారు. మరి సినిమా రంగం అనేది మోస్ట్ ఎట్రాక్టివ్ ఫీల్డ్. పరిశ్రమకు వచ్చాక ఏ హీరోయిన్ ని అయినా ఇష్టపడ్డారా? అని యాంకర్ అడిగారు. అవునని ఎన్టీఆర్ సమాధానం చెప్పాడు. ఎవరు అని యాంకర్ అడగ్గా… అప్పట్లో అందురూ అనుకున్నారు కదా. ఆ హీరోయినే అని ఎన్టీఆర్ సమాధానం చెప్పాడు.
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మికి మోహన్ బాబు చేసిన అన్యాయం ఏమిటీ… ఇన్నాళ్లు ఎందుకు దాచింది?
ఒక దశలో ఇష్టపడ్డాను. తర్వాత ఎందుకో కాదు అనిపించింది, అని ఎన్టీఆర్ అన్నారు. ఆ హీరోయిన్ ని ప్రేమించినందుకు బాధ పడ్డారా? అని అడగ్గా.. ఛీ అలాంటిది ఏమీ లేదు. నేను తీసుకున్న ఏ నిర్ణయం విషయంలో నేను బాధపడను. ఆ ఎఫైర్ వలన ఎలాంటి సమస్య కూడా రాలేదు… అని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇంతకీ ఎన్టీఆర్ చెప్పిన ఆ హీరోయిన్ ఎవరంటే… సమీరా రెడ్డి. ఈ బాలీవుడ్ భామ నరసింహుడు చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.
Also Read: Actress: ఈ చిన్నారి.. ఇప్పుడు ట్రెండీ బ్యూటీ.. ఎవరో చెప్పుకోండి..
దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన నరసింహుడు డిజాస్టర్ అయ్యింది. నరసింహుడు అనంతరం దర్శకుడు సురేందర్ రెడ్డితో ఎన్టీఆర్ అశోక్ చిత్రం చేశాడు. అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ రెండు చిత్రాల్లో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. సమీరా రెడ్డి జై చిరంజీవా చిత్రం తర్వాత టాలీవుడ్ కి దూరమైంది. ఆమె పరిశ్రమకు దూరం కావడానికి ఎన్టీఆర్ తో ఎఫైర్ రూమర్స్ కూడా కారణమని కథనాలు వెలువడ్డాయి.