Actress: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇతర పరిశ్రమల కు చెందిన భామలు సందడి చేయడం కొత్తేమీ కాదు. అలనాటి నుంచి తమిళం, కన్నడం, మలయాళం నుంచి వచ్చిన వారు ఇక్కడ స్టార్లుగా మారారు. అటు నార్త్ నుంచి సైతం తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తమ ప్రతాపాన్ని చూపించారు. అయితే ఇటీవల కాలంలో కన్నడ నుంచి చాలా మంది భామలు తెలుగు సినిమాల బాట పట్టారు. వచ్చీ రాగానే అగ్ర హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాగే ఓ అమ్మడు వచ్చి తన స్టైల్లో సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన చిన్న నాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రెండో సినిమానే అక్కినేని నాగార్జునతో కలిసి నటించింది. ఇప్పటి వరకు నటించిన వాటిల్లో అందాల ఆరబోతతో యూత్ ఫాలో పెంచుకున్న ఈమె ఎవరో కాదు… ఆషికా రంగనాథ్. తెలుగులో ‘అమిగోస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆషికా ఆ తరువాత నాగార్జునతో కలిసి ‘నా సామి రంగా’ సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు మరో అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ లో కనిపించనుంది.
ఆషికా రంగనాథ్ నటించింది కొన్ని సినిమాలే అయినా.. తన అందచందాలతో యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది. గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే చేసిన సినిమాలు తక్కువే అయినా అగ్రహీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవడం చూస్తే ఈ మె ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విశ్వంభర తరువాత మరిన్ని ఛాన్స్ లు కొట్టేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
Also Read: Kalki Movie: కల్కి సినిమా నుంచి మరో భారీ అప్డేట్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్…
సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాకు నిత్యం కనెక్ట్ అయి ఉంటుంది ఆషికా. లేటేస్ట్ గా ఆషికా రంగనాథ్ పోస్ట్ చేసి ట్రెండీ బ్యూటీగా మారుతోంది. ఈ ఫొటోలను చూసి కుర్రకారు షాక్ అవుతున్నారు. ఇంత అందం ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుంది?.. అంటూ కారమెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుత కాలంలో ఆషికా రంగనాథ్ హవా కొనసాగుతుందని చర్చించుకుంటున్నారు. మరి ఈ బ్యూటీ ఏ మేరకు అవకాశాలు తెచ్చుకుంటుందో చూడాలి.