Homeఎంటర్టైన్మెంట్Eagle: ఈగల్ అనే...

Eagle: ఈగల్ అనే టైటిల్ పెట్టడం వెనక అసలు కారణం ఏంటంటే..?

Eagle: రవితేజ హీరోగా వస్తున్న ఈగల్ సినిమా సంక్రాంతి కనుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంతనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ చాలా కొత్తగా కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తన లుక్కు గాని, యాక్టింగ్ గాని పూర్తిగా ఈ సినిమా కోసం మార్చేసినట్టుగా కూడా కనిపిస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాకి ఈగల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే దానిమీద సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇక ఈ అంశం మీద స్పందించిన ఈ సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా చూస్తేనే ఈ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టాము అనేది అర్థం అవుతుంది అలాగే ఆ టైటిల్ కి ఈ సినిమాలో జస్టిఫికేషన్ ఇచ్చాము అంటూ ఆయన చెప్తున్నారు. అయితే ఈ సినిమాతో రవితేజ కి భారీ హిట్ దక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు.

ఇక సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఈగల్ సినిమా మాత్రం తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంటుంది అంటూ దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండాలో ఈ సినిమాలో అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. రవితేజని ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఒక క్యారెక్టర్ లో మీరు చూడబోతున్నారు అంటూ దర్శకుడు ఈ సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ కూడా మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంటుందని కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

అలాగే టైటిల్ వెనుక దాగి ఉన్న ఒక సస్పెన్స్ ని ఈ సినిమా చూసి తెలుసుకోవాలంటు రవితేజ కూడా డైరెక్టర్ లాగనే చెప్పడం విశేషం… ఇక ఈ సినిమాతో పాటు రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది.ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది… అయితే దసర కి వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమా నిరాశ పరచడంతో ప్రస్తుతం రవితేజ అభిమానులు కూడా ఈగల్ మీద మంచి అంచనాలు అయితే పెట్టుకున్నారు…

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండటం విశేషం...ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక పాట దాని తర్వాత ఎమోషనల్ సన్నివేశాలు చివరగా ఎలివేషన్ సీన్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పెర్ఫెక్ట్ గా సెట్...

Vamshi Paidipally: వంశీ పైడిపల్లి ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడా…

Vamshi Paidipally: 'మున్నా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ పైడిపల్లి చాలా తక్కువ సమయం లోనే స్టార్ డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతో విజయాన్ని సాధించకపోయిన ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన బృందావనం, రామ్ చరణ్ తో చేసిన ఎవడు, నాగార్జునతో ఊపిరి సినిమాలను చేశాడు. మహేష్ బాబుతో...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.