Zainab Rawadji : వచ్చే నెలలో నాగ చైతన్య,శోభిత దూళిపాళ్ల పెళ్లి జరగబోతున్న సందర్భంగా అక్కినేని కుటుంబం తో పాటు అభిమానులు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఆనందాన్ని అభిమానులు పూర్తిగా ఆస్వాదించే లోపు, వాళ్లకు భుక్తాయాసం వచ్చేలాగా అఖిల్ పెళ్లిని కూడా ప్రకటించి నాగార్జున అభిమానులకు గూస్ బంప్స్ రప్పించాడు. గత మూడేళ్ళుగా అఖిల్ జైనబ్ రవడ్జీ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడని, వీళ్లిద్దరి వ్యవహారం వీళ్ళు ప్రేమించుకుంటున్న కొత్తల్లోనే నాగార్జున కి తెలుసని, ఒకేసారి నాగ చైతన్య, అఖిల్ పెళ్లిళ్లు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇన్ని రోజులు నాగార్జున ఈ విషయం సర్ప్రైజ్ గా ఉంచాడని తెలుస్తుంది. అయితే ఈమె పేరు ప్రకటించిన వెంటనే అసలు ఎవరు ఈ జైనబ్ రవడ్జీ?, సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయేనా?, ఇప్పటి వరకు ఏమి సినిమాలు చేసింది?, సోషల్ మీడియా లో ఈమె ఉందా అంటూ అక్కినేని అభిమానులు గూగుల్ మొత్తం జల్లెడేశారు.
అలా పరిశీలించిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఈమె సినీ హీరోయిన్ కాదు. సోషల్ మీడియాలో లేదు. వ్యాపార రంగానికి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త. అతని పేరు జుల్ఫీ రవడ్జీ. ఈయనకి దేశవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఆయన నెల సంపాదన వందల కోట్లలో ఉంటుంది. జైనబ్ రవడ్జీ కి కూడా దేశ వ్యాప్తంగా స్కిన్ కేర్ కి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఈమె నెల సంపాదన 100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. ఆస్తుల విషయం లో, సంపాదన విషయం లో అక్కినేని కుటుంబానికి ఏ మాత్రం తీసిపోని కుటుంబం నుండి వచ్చింది జైనబ్ రవడ్జీ. చూసేందుకు ఎంతో చక్కగా కనిపిస్తున్న ఈ అమ్మాయి, ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అఖిల్ తో కలిపి ఆమెని చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు.
నిన్న బందు మిత్రుల సమక్ష్యం లో చాలా సాధారణంగా వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిపోయింది. నాగ చైతన్య పెళ్లి డిసెంబర్ 4వ తేదీన జరగబోతుంది. అదే విధంగా అఖిల్ పెళ్లి జనవరి నెలలో చెయ్యాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది అక్కినేని ఫ్యామిలీ. అయితే సమంత నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన కొత్తల్లోనే, అఖిల్ శ్రేయ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య రెండవ పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా అలాంటి సందర్భం ఎదురవ్వడం గమనార్హం. పెళ్లిళ్ల తర్వాత ఈమధ్య యంగ్ హీరోల జాతకాలు పూర్తి గా మారిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. కిరణ్ అబ్బవరం వంటి హీరోలు పెళ్లి తర్వాత భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అయినా ఇప్పటికీ ఒక్క సూపర్ హిట్ కూడా లేని అఖిల్ కెరీర్ కూడా ఈ పెళ్లి తర్వాత మారుతుందో లేదో చూద్దాం.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: What is the background of zainab ravadji whom akkineni akhil is going to marry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com