https://oktelugu.com/

Kalki Movie: కల్కి సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్ ఏంటి..?

Kalki Movie: ముఖ్యంగా దీపికా పదుకొనే మాత్రం ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 13, 2024 11:59 am
    What is Deepika Padukone character in Kalki

    What is Deepika Padukone character in Kalki

    Follow us on

    Kalki Movie: ఈనెల 27వ తేదీన ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి ట్రైలర్ ను కనక మనం చూసుకున్నట్లయితే అందులో కొన్ని విషయాలను రివిల్ చేసినట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా దీపికా పదుకొనే మాత్రం ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఎందుకంటే ఆమె పద్మ అనే ఒక క్యారెక్టర్ ని పోషించబోతుందా? లేదా కల్కి తల్లి సుమతి పాత్రను పోషిస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ భైరవ గా, అమితాబచ్చన్ అమర అశ్వద్ధామ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ మహాభారత కాలంలో స్టార్ట్ అయి 2898 కాలం వరకు సాగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కాలంలో జనాలకి కలిగే ఇబ్బందుల నుంచి వాళ్ళని కాపాడడానికి కల్కి అవతారంలో శ్రీ మహా విష్ణువు అవతరిస్తాడు అనేది పురాణాల ప్రకారం మనకు తెలుస్తున్న విషయం. ఇక ఇప్పుడు కల్కి మాత్రం ప్రభాస్ కాదు అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది.

    Also Read: Akira Nandan: పవన్ ప్రమాణస్వీకారం స్పెషల్… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకీరా లుక్!

    ఇక భైరవ పాత్రను పోషిస్తున్న ప్రభాస్ అలాగే కల్కి పాత్రలో కూడా తనే నటించి ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక దీపిక పదుకొనే కల్కి తల్లిగా దర్శనమిస్తుందా లేదా అనేది క్లారిటీగా తెలియడం లేదు… ఇక కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రని పోషిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ ట్రైలర్ ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందనే చెప్పాలి.

    Also Read: Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సినిమాలో ‘పెరుమాళ్ళ పాడు నాగేశ్వర ఆలయం’.. అసలేంటిది? దీని ప్రత్యేకత ఏంటి..?

    మరి ఈ సినిమా విషయంలో పురాణాలకు సంబంధించిన కథను చెబుతూనే 2898 యుగం నాటి ప్రభావాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఇక కల్కి గురువుగా భైరవ ఉండబోతున్నాడా అనే విషయం మీద ప్రేక్షకుడికి ఉన్న అనుమానాలు తీరాలంటే జూన్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…