https://oktelugu.com/

Akira Nandan: పవన్ ప్రమాణస్వీకారం స్పెషల్… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకీరా లుక్!

పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తయారైన విధానం అందరినీ ఆకర్షించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 12, 2024 / 06:03 PM IST

    Akira Nandan

    Follow us on

    Akira Nandan: పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈసారి అసెంబ్లీ అడుగుపెట్టనున్నారు. నేడు ఎన్డీయే అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే వేదికపై కూటమి అభ్యర్థిగా గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అలాగే కేంద్ర పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తయారైన విధానం అందరినీ ఆకర్షించింది. తెలుగు తనం, సాంప్రదాయం ఉట్టిపడేలా అకీరా పంచె కట్టులో తండ్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాడు. ఎర్ర చొక్కా, తెల్లని పంచె ధరించి ప్రత్యేకంగా దర్శనం ఇచ్చాడు. అకీరా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

    ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం నేడు తన ఆనందం తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా పిల్లల ఫోటోలు ఆమె షేర్ చేశారు. నాన్న ముఖ్యమైన రోజు పిల్లలు ఆద్య, అకీరా ఇలా తయారయ్యారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి బెస్ట్ విషెస్. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలన్న ఆయన లక్ష్యం నెరవేరాలి అని రేణు దేశాయ్ కామెంట్ చేసింది.

    కాగా అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కానున్నాడు. ఈ క్రమంలో వారసుడు అకీరా వెండితెరకు పరిచయం కావాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. అకీరాకు హీరో అయ్యే వయసు వచ్చేసింది. కాబట్టి త్వరగా లాంచ్ చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్ వినిపిస్తున్నారు. కాగా అకీరా ఇప్పటికే ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ వంటి ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందాడు.