https://oktelugu.com/

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సినిమాలో ‘పెరుమాళ్ళ పాడు నాగేశ్వర ఆలయం’.. అసలేంటిది? దీని ప్రత్యేకత ఏంటి..?

మొత్తానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందంటూ సినిమా యూనిట్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 1500 కోట్లకు పైన వసూళ్లను రాబడుతుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల లెక్కలను వేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 13, 2024 8:54 am
    Kalki 2898 AD

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ‘కల్కి 2898 ఏడి’ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను శరవేగంగా నిర్వహిస్తున్న సినిమా యూనిట్ ఈ మూవీ మీద విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండడమే కాకుండా ప్రేక్షకులందరిని కట్టిపడేసే విధంగా ఉంది అనే పేరు అయితే సంపాదించుకుంది.

    ఇక మొత్తానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందంటూ సినిమా యూనిట్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 1500 కోట్లకు పైన వసూళ్లను రాబడుతుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల లెక్కలను వేస్తున్నారు. ఇక మొత్తానికైతే 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 1500 కోట్లకు పైన కలెక్షన్లు రాబడితేనే భారీ సక్సెస్ సాధించినట్టుగా అవుతుంది.

    లేకపోతే మాత్రం ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించదు. కాబట్టి ప్రస్తుతం ఈ సినిమా మీదనే సినిమా యూనిట్ భారీ అంచనాలైతే పెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమళ్ళపాడు లోని నాగేశ్వర ఆలయాన్ని ఈ సినిమా లో చూపించబోతున్నట్టుగా ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఆలయాన్ని ఆధారంగా చేసుకొని ప్రభాస్ అమితాబచ్చన్ల మధ్య కొన్ని సీన్లు కూడా ఉంటాయంటూ ప్రచారం అయితే జరుగుతుంది. ఇక 2020 సంవత్సరంలో పెరుమాళ్ళపాడు స్థానిక యువత ఇసుకలో ఉన్న ఈ ఆలయాన్ని వెలికి తీశారు. స్థానికులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి నివేదికను కూడా తెలియజేశారు.

    ఇక దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇసుక తుఫానుల కారణంగా ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయింది. ఇక ఆలయం కింద వందల ఎకరాల మన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే కల్కి 2898 ఏడి సినిమాతో ప్రభాస్ ఒక భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనే విషయం మీదనే ప్రస్తుతం విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా భారీ సక్సెస్ ని అందుకుంటే ప్రభాస్ ని మించిన స్టార్ హీరో ఇండియాలో మరొకరు లేరు అనేది మరొకసారి కన్ఫర్మ్ అవుతుంది…