Telugu Film Industry: ఈ 6 నెలల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏం జరిగింది..?

Telugu Film Industry: ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం మహేష్ బాబు(Mahesh Babu) లాంటి స్టార్ హీరో గుంటూరు కారం సినిమాతో వచ్చినప్పటికీ ఆయన పెద్దగా మ్యాజిక్ అయితే చేయలేకపోయాడు.

Written By: Gopi, Updated On : June 7, 2024 2:38 pm

Telugu Film Industry

Follow us on

Telugu Film Industry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న చాలా మంది హీరోలు ప్రస్తుతం ఈ సంవత్సరం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మొదటి ఆరు నెలలు ముగిసిపోతున్న క్రమంలో ఇప్పటివరకు తెలుగు స్టార్ హీరోలు ఎవరు కూడా బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలను రిలీజ్ చేయలేకపోయారు.

ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం మహేష్ బాబు(Mahesh Babu) లాంటి స్టార్ హీరో గుంటూరు కారం సినిమాతో వచ్చినప్పటికీ ఆయన పెద్దగా మ్యాజిక్ అయితే చేయలేకపోయాడు. ఇక వెంకటేష్(Venkatesh) సైంధవ్, నాగార్జున(Nagarjuna) నా సామి రంగా సినిమాలు ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఇక ఈ క్రమంలో వాళ్లని మినహాయిస్తే ఈ ఆరు నెలల వ్యవధిలో ఏ ఒక్క పెద్ద సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఇక చిన్న సినిమాల్లో హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకొని ఈ ఆరు నెలల కాలంలో సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి.

Also Read: Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి కాంబో లో వచ్చే సినిమా టైటిల్ ఇదేనా..?

ఇక ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడం అనేది ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి. ఇక చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికి వాటిలో కంటెంట్ గాని, ప్రజెంటేషన్ గాని సరిగ్గా లేకపోవడం వల్లే ఆ సినిమాలు ఆశించిన మేరకు ఫలితాలను అయితే అందుకోలేకపోయాయి. ఇక ఈనెల చివరి వారంలో ప్రభాస్ కల్కి సినిమాతో వస్తున్నాడు. కాబట్టి ఈనెల చివర్లో ప్రభాస్ తన ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విక్టరీ సెలెబ్రేషన్స్ లో సాయి ధరమ్ అల్లరి… మామయ్యల రియాక్షన్ చూడండి!

ఇక రాబోయే ఆరు నెలల్లో మాత్రం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ న్యూస్ సినిమా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇక పెద్ద హీరోలు తమ సినిమాలతో రావడమే కాకుండా ప్రేక్షకులను అలరిస్తూ కలెక్షన్ల వర్షం కురిపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో మన హీరోలు ఎలాంటి సక్సెస్ లు సాధిస్తారు అనేది…